Asheagandha Health : ఆరోగ్యాన్ని మార్చేసే ఆయుర్వేద మూలికల గురించి తెలుసా .. !
ABN , Publish Date - Jun 07 , 2024 | 03:27 PM
ఆయుర్వేదం ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది. ఆరోగ్యాన్ని అందిస్తున్న పురాతన వైద్య ప్రక్రియ. ఇది వాత, పిత్త, కఫలపై పనిచేస్తుంది. ఆయుర్వేద చికిత్సలో రోగి అనారోగ్య దోషాలను తీసేస్తుంది. సమతుల్యం చేస్తుంది.
ఆయుర్వేదం ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది. ఆరోగ్యాన్ని అందిస్తున్న పురాతన వైద్య ప్రక్రియ. ఇది వాత, పిత్త, కఫలపై పనిచేస్తుంది. ఆయుర్వేద చికిత్సలో ప్రతి రోగి అనారోగ్య దోషాలను తీసేస్తుంది. సమతుల్యం చేస్తుంది. ఆయుర్వేదంలో ఆకులు, వేర్లు, పువ్వులు, బెరడు నుండి మూలికా పదార్థాలను ఉపయోగిస్తారు.
ఆయుర్వేద మూలికల ప్రయోజనాలు..
అనారోగ్యం నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
ప్రధాన వ్యాధితో ఇతర ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి.
అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శక్తిని పెంచుతాయి.
అశ్వగంధ..
అశ్వగంధ అనేది చాలా ఉపయోగాలున్నాయి. ఇది సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. ఆఫ్రికా, మధ్యధరా ఖండంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అశ్వ గంథ అంటే గుర్రం, వాసన అనే అర్థాలున్నాయి. వింటర్ చెర్రీ, లేదా ఇండియన్ జిన్నెంగ్ అని కూడా పిలుస్తారు. అశ్వగంధను ఉపయోగిస్తారు.
1. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
2. ఒత్తిడి తగ్గిస్తుంది. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
3. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
Eye Health : కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..?
బ్రహ్మి..
బ్రాహ్మి మొన్నీరి అని కూడా పిలుస్తారు. ఇది నాడీ సంబంధిత రుగ్మతలకు చికిత్సగా పనిచేస్తుంది.
1. ఇది బ్రెయిన్ టానిక్ లా పనిచేస్తుంది.
2. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మేధస్సును మెరుగుపరుస్తుంది.
3. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది.
శతావరి..
దీనిని మూలికల రాణిగా పిలుస్తారు. ఇందులో సపోనిన్స్ ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ మెరుగుపడేందుకు సహకరిస్తుంది.
3. శ్వాసకోశ లక్షణాల నుంచి ఉపశమనం పొందే అద్భుతమైన మూలిక.
Health Tips : టీ, కాఫీలకు బదులుగా ఎన్ని తెలుసా.. వీటిని తీసుకుంటే..
లైకోరైస్..
లైకోరైస్ పాత రోజుల నుంచి భారతదేశంలోనే కాకుండా ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
1. ఎసిడిటీ, పొట్టలో పుండ్లు, ఫుడ్ పాయిజనింగ్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
2. జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు, చుండ్రును నివారించడానికి ఇది అద్భుతమైన మూలిక
వేప
వేప చేదు రుచితో ఎన్నో రుగ్మతలకు చెక్ పెట్టే శక్తిని కలిగి ఉంది. 75శాతం వేప అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
1. వేపలో క్రిమినాశక యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి.
2. శక్తివంతమైన రక్త శుద్ధి చేసే గుణాలున్నాయి.
3. మొటిమలు, తామర, చర్మ వ్యాధులకు చికిత్స చేస్తుంది.
4. జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
5. నోటి శుభ్రతకు దంత క్షయం, ఇన్ఫెక్షన్లను నివారించడానికి పనిచేస్తుంది.
మంజిష్ట
మంజిష్ట రక్త శుద్ధికి, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి సహకరిస్తుంది. ఇది కాలేయం, మూత్రపిండాలు, చర్మాన్ని శుభ్రపరచడానికి మంజిష్ట ప్రభావవంతంగా పనిచేస్తుంది.
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2. ఛాయను మెరుగుపరచడానికి, మొటిమలను క్లియర్ చేయడానికి సహకరిస్తుంది.
3. జ్ఞాపకశక్తిని పెంచి, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.