Overall Health : ప్రతి రోజూ వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..!
ABN , Publish Date - Jun 10 , 2024 | 01:49 PM
బరువు పెరగడం కూడా సరైన వ్యాయామం లేకపోవడం వల్లనే.. ఊబకాయం, వ్యాయామం కేలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహకరిస్తుంది.
మనం తినే ఆహారం, హడావుడి జీవన శైలి కారణంగా శరీరంలో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయి. ఈ మార్పులతో ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామం తప్పనిసరి. అయితే కాస్త బద్దకించినా ఈ వ్యాయామం చేయకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వ్యాయామం లేకపోతే ఎలాంటి పరిణామాలుంటాయంటే..
వ్యాయామం సరిగా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన జీవనశైలి లేకపోవడం, వ్యాయామం స్కిప్ చేయడం వల్ల ఊబకాయం అధికంగా పెరుగుతుంది. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయకపోతే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరగడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్స్ సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుంది.
బరువు పెరగడం కూడా సరైన వ్యాయామం లేకపోవడం వల్లనే.. ఊబకాయం, వ్యాయామం కేలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహకరిస్తుంది.
బలహీనమైన ఎముకలు, కండరాల ఆరోగ్యాన్ని సమతుల్య ఆహారం, రెగ్యులర్ శారీరక శ్రమతో ఎముకల శక్తిని పెంచవచ్చు.
Health Tips : ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..
తక్కువ శక్తి స్థాయిలు ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల అలసటగా అనిపించినా ఇది దీర్ఘకాలంలో శక్తిస్థాయిలను పెంచడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది.
నిద్ర సరిగా లేకపోవడం, రెగ్యులర్ వ్యాయామం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. శారీరక శ్రమ చేయడం వల్ల మంచి నిద్రను ఇస్తుంది.
Liver Health : కాలేయంలో వాపు వస్తే కనుక సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యల నుంచి వ్యాయామం ఉపశమనం కలిగిస్తుంది.
మానసికంగా ధైర్యంగా నిలబడే విధంగా చేస్తుంది.
వయసు పెరిగే కొద్దీ రోజువారి పనులు చేసే సామర్థ్యం తగ్గుతుంది. దీనిని మెరుగుపరిచేందుకు వ్యాయామం చాలా అవసరం.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.