Fatty Liver : కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరించే పండ్ల గురించి తెలుసా..!
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:51 AM
కాలేయం మన శరీరం నుంచి విషాన్ని ప్రాసెస్ చేయడంలో శరీరాన్ని శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంది. దీనికోసం సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
పండ్లతో కాలేయాన్ని ఫ్యాటీ లివర్ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మందిలో వింటున్న ఒక సమస్య ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇది శరీరంలో అది ముఖ్యమైన అవయవం అయిన కాలేయానికి సోకే వ్యాధి. ఇది చాలావరకూ శరీరాన్ని నెమ్మదించేలా చేస్తుంది. ముఖ్యమైన విధులను చేసే కాలేయానికి ఈ వ్యాధి పెద్ద ఇబ్బందినే తెస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గాలంటే సరైన జీవనశైలి అలవాట్లను అలవర్చుకోవాలి. దానితో పాటు శరీర శ్రమ కూడా అంతే అవసరం. సరైన నిద్ర, సరైన సమతుల్య ఆహారం లేకపోవడం కూడా శరీరానికి ఇబ్బందిని తెచ్చి పెడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య కూడా అలా వచ్చేదే. దీనికి పండ్లతో చెక్ పెట్టవచ్చు. ఈ పండ్లను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయ సమస్యను తగ్గించే ఆ పండ్లు ఇవే..
కాలేయం మన శరీరం నుంచి విషాన్ని ప్రాసెస్ చేయడంలో శరీరాన్ని శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంది. దీనికోసం సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
ద్రాక్షపండ్లు.. పుల్లగా, తీయగా ఉండే ద్రాక్ష పిల్లలకు, పెద్దలకూ అందరికీ ఇష్టమైనమే.. యాంటీ ఆక్సిడెంట్లను, విటమిన్ సి పుష్కలంగా ఉండే ద్రాక్షపండ్లలో కాలేయాన్ని రక్షించే ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవి కాలేయంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.
Vegetarian Protein : శాకాహారులు తినేందుకు 7 శాఖాహార ప్రోటీన్ పదార్థాలు ఇవే..!
అవకాడోలు.. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన అవకాడోలు పిత్త ఉత్పత్తిని పెంచి, కాలేయానికి సహకరిస్తాయి. జీర్ణక్రియను పెంచడం, టాక్సిన్ తొలగించడంలో అవకాడోలు సహకరిస్తాయి.
నిమ్మకాయలు.. నిమ్మకాయులు సిట్రస్ జాతికి చెందిన ఈ పుల్లని పండ్లలో విటమిన్ సి ఉంటుంది. రోజూ గోరువెచ్చని నీటిలో చిన్న నిమ్మకాయ చెక్కను కలిపి తీసుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది.
బెర్రీలు.. బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తాయి. మంటను తగ్గించడంలో కూడా సహకరిస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయానికి బెర్రీలు చక్కని ఎంపిక.
Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..
యాపిల్స్.. యాపిల్లో ఉండే పెక్టిన్, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో, కాలేయం నుంచి విషాన్ని తొలగించడంలో సహకరిస్తుంది. ఆపిల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యానికి మంచిది.
బొప్పాయి.. జీర్ణ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న బొప్పాయి సమర్థవంతమైన జీర్ణక్రియను అందిస్తాయి. ఇది హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను తటస్థీకరించడంలో కాలేయానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.
Biotin Rich Foods : ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ వీటిని తీసుకుంటే..
పుచ్చకాయ..పుచ్చకాయలో అధిక నీటి కంటెంట్ కారణంగా శరీరం నుంచి విషాన్ని ఫ్లప్ చేయడానికి సహాయపడుతుంది. అయితే దాని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం బాగా పనిచేసేందుకు సహకరిస్తాయి.
కివి.. విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ కివీ పండ్లు జీర్ణక్రియకు సహకరిస్తాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల రిఫ్రెష్, రుచికరమైన అనుభూతి కలుగుతుంది.
క్రాన్బెర్రీస్.. క్రాన్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాలేయ సమస్యలను తగ్గిస్తాయి.
అనాస పండు.. బ్రోమెలైన్, పైనాపిల్ లో ఉండే ఎంజైమ్, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రోటీన్ లను విచ్ఛిన్నం చేయడంలో కాలేయానికి మద్దతు ఇస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.