Health Tips : బ్లాక్ రైస్‌ని ఎన్ని రకాలుగా వండచ్చో తెలుసా..!
ABN , Publish Date - Aug 16 , 2024 | 11:51 AM
బియ్యం తెల్లగా ఉండటం మాత్రమే తెలిసినవారు నల్లబియ్యాని చూసి కాస్త ఆశ్చర్యపోతారు. బియ్యం రంగులో తేడాలు ఉన్నట్టే, అందులోని పోషకాల పరంగానూ తేడాలుంటాయి. బియ్యాన్ని తెలుపు, పసుపు, నలుపు రంగుల్లో చూసినవారైతే మాత్రం నల్ల బియ్యంతో కలిగే ఉపయోగాలు కచ్చితంగా తెలుసుకోవాలి. బ్లాక్ రైస్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆంథోసైనిన్స్ ఇవి క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గిస్తాయి.
బియ్యం తెల్లగా ఉండటం మాత్రమే తెలిసినవారు నల్లబియ్యాని చూసి కాస్త ఆశ్చర్యపోతారేమో. బియ్యం రంగులో తేడాలు ఉన్నట్టే, అందులోని పోషకాల పరంగానూ వ్యత్యాసాలు ఉంటాయి. బియ్యాన్ని తెలుపు, పసుపు, నలుపు రంగుల్లో చూసినవారైతే మాత్రం నల్ల బియ్యంతో కలిగే ఉపయోగాలు కచ్చితంగా తెలుసుకోవాలి. బ్లాక్ రైస్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గిస్తాయి. బ్లాక్ రైస్‌లో ఐరన్, ఎసెన్షియల్, అమైనో యాసిడ్‌లు, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ ఇంటాయి. ఈ బియ్యంతో తయారుచేసుకునే వెరైటీల విషయానికి వస్తే...
ఫర్బిడెన్ బ్లాక్ రైస్ సలాడ్...
బ్లాక్ రైస్ సూపర్ ఫుడ్స్‌లో ఒకటి. ఇది రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యపరంగానూ ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఆ రైస్‌తో చేసే అన్నంలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
రొయ్యలు, గుమ్మడికాయతో వీనస్ బ్లాక్ రైస్..
వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయం కింద బ్లాక్ రైస్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు గుమ్మడి ముక్కలు, రొయ్యలు కలిపి చేసే వంటకం మంచి రుచిగా ఉంటుంది. గుమ్మడికాయలో పోషకాలు కూడా పుష్కలంగా ఉండటంతో చక్కటి ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది.
స్పైసీ ఫర్బిడెన్ రైస్ సలాడ్..
బ్లాక్ రైస్, పెప్పర్, జీడిపప్పుల స్పైసీ మిశ్రమం ఇది. ఈ అన్నాన్ని చేపలు, చికెన్ కర్రీతో కూడా తీసుకోవచ్చు.
Skin Care : చర్మం పొడిబారుతుంటే దానికి కారణాలు, నివారణలు ఇవిగో...!
1. నల్ల బియ్యన్ని ఉడికించి చల్లారనివ్వాలి. దీనిలోకి పెప్పర్, టమాటాలు కలిపి తరిగిన కూరగాయతో తీసుకుంటే చక్కని రుచితో బాగుంటుంది.
2. కొబ్బరి పాలు, కొంచెం పంచదార, వెనీలాతో బ్లాక్ రైస్ ఉడికించి తీసుకుంటే రుచికరంగా ఉంటుంది.
3. బ్రోకలీ, క్యారెట్లు, బెల్ పెప్పర్స్ వంటివి కలిపి చేసే బ్లాక్ పైస్ స్టిర్ ఫ్రై రుచికరంగా ఉంటుంది.
Tulasi Plant : వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా పెంచాలో తెలుసా..!
4. బ్లాక్ పైస్ సూప్: దీనికి కూరగాయలు, చికెన్ కలిపి సూప్ చేసుకుంటే మరీ రుచి.
5. గ్రిల్డ్ చికెన్ లేదా టోపు, వెజిటెబుల్స్‌తో కలిపి బ్లాక్ రైస్ తీసుకుంటే ప్రోటీన్లు శరీరానికి చక్కగా అందుతాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.