Health Benefits : చెరకు రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!.
ABN , Publish Date - Jun 01 , 2024 | 02:33 PM
ఎండాకాలం కాస్త పెరగ్గానే చల్లని పానీయాల మీదకు మనసు పోతూ ఉంటుంది. చల్లదనం శరీరానికి ఈ సమయంలో చాలా అవసరం. తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు కూడా ఈ ఎండాకాలం తప్పనిసరి. మరి పానీయాల విషయంలో చెరకుతో చేసే పానీయం ఇంకా మంచి రుచిని ఆరోగ్యా ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో ముఖ్యంగా..
చెరకు అనగానే తీపి రుచి గుర్తుకువస్తుంది.తీపి పదార్థం తయారవ్వాలంటే చెరకుతోనే మొదలు కావాలి. ఎండాకాలం కాస్త పెరగ్గానే చల్లని పానీయాల మీదకు మనసు పోతూ ఉంటుంది. చల్లదనం శరీరానికి ఈ సమయంలో చాలా అవసరం. తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు కూడా ఈ ఎండాకాలం తప్పనిసరి. మరి పానీయాల విషయంలో చెరకుతో చేసే పానీయం ఇంకా మంచి రుచిని ఆరోగ్యా ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో ముఖ్యంగా..
చెరకు రసం తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఈ పానీయంలో అల్లం, నిమ్మకాయను కూడా కలిపి తీసుకుంటూ ఉంటారు. దీనితో మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. అలాగే మూత్ర పిండాల ఆరోగ్యాన్ని పెంచుతుంది.
1. కడుపు నొప్పి తగ్గుతుంది. శరీరంలో వేడి పెరగకుండా చేస్తుంది.
2. యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది.
3. కాలేయానికి వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా కామెర్ల వ్యాధి నుంచి కాపాడుతుంది.
4. చెరకు రసంపై అనేక ఆధునిక అధ్యయనాలు జరిగాయి.. ఇందులోని గుణాలు అమోఘం అని తేలింది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. ఎలక్ట్రోలైట్ లను తిరిగి నింపడానికి సహకరిస్తుంది. అలాగే కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కూడా ఇస్తుంది.
Expensive Foods : భారతదేశంలో లభించే 5 అత్యంత ఖరీదైన ఆహారాలు..
5. తాగిన వెంటనే శక్తిని ఇస్తుంది. కాస్త నీరసంగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల త్వరగా నీరసం నుంచి కోలుకోగలుగుతారు.
6. చెరకు రసం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను నియంత్రించడంలో సహకరిస్తుంది.
7. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మినరల్స్, పోషకాలతో ఉంటుంది శక్తిని పెంచుతుంది.
ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..
8. చర్మ ఆరోగ్యం.. చెరకు రసం చర్మాన్ని తేమాగ చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
9. బరువు తగ్గడం.. చెరకు రసంలో చక్కెర అధికంగా ఉన్నప్పటికీ, కొన్ని అధ్యయమాలు జీవక్రియను పెంచడం, బరువు తగ్గడంలో సహాయపడతాయి. అయితే మితంగా తీసుకోవడం ముఖ్యం.
10. చెరకు రసం శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడి రోజుల్లో శరీరాన్ని చల్లాగా ఉంచుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.