Share News

Chapped Lips : పెదవులు పగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా..!

ABN , Publish Date - Jul 03 , 2024 | 01:55 PM

ఈ సాధారణ సమస్య తరచుగా డీహైడ్రేషన్, వాతారవణంలో వస్తున్న మార్పులు, నోటి శ్వాస, చికాకు కలిగించే పదార్థాలు తీసుకోవడం, కొన్ని ఉత్పత్తులు కారణంగా పెదవులు ఇబ్బందికరంగా మారతాయి.

Chapped Lips : పెదవులు పగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా..!
Chapped Lips

అందమైన పెదవులు, మరింత అందమైన చిరునవ్వును పూస్తాయి. పెదవులు అందంగా ఉంటే నవ్వు కూడా అందంగా పూస్తుంది. సున్నితమైన ఈ పెదవులకు పోషణ చాలా అవసరం. పెదవులు పగిలి ఇబ్బంది కరంగా మారడం అప్పుడుప్పుడూ అనుభవిస్తూనే ఉంటాం. పగిలిన పెదవులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. చూసేందుకు కూడా అందంగా ఉండవు. ఈ పెదవులు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. దీని నుంచి బయటపడాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే..

వేసవిలో పెదవులు పగిలే ఇబ్బంది ఉన్నట్టే, కాలం మారి వర్షాకాలంలోకి మారుతుంటే కూడా పెదవులు పగులుతాయి. ఇక పొడి పెదవులుకు కారణాలు ఏంటంటే.. పొడి పెదవులపై చర్మం పొడిగా మారి అసౌకర్యంగా, పొట్టు, కొన్ని సార్లు పగుళ్లు ఏర్పడతాయి. ఈ సాధారణ సమస్య తరచుగా డీహైడ్రేషన్, వాతారవణంలో వస్తున్న మార్పులు, నోటి శ్వాస, చికాకు కలిగించే పదార్థాలు తీసుకోవడం, కొన్ని ఉత్పత్తులు కారణంగా పెదవులు ఇబ్బందికరంగా మారతాయి. దీనికి చికిత్స చేయకుండా మానేస్తే అసౌకర్యంతో పాటు నొప్పి కూడా ఉంటుంది.

కారణాలు..

పొడి పెదవులు డీహైడ్రేషన్ కారణంగా ఏర్పడతాయి. దీనికి శరీరంలో ద్రవాలు లేనప్పుడు, పెదవులు తరచుగా పొడిబారినట్టుగాకలిపిస్తాయి.

ఒక్కోసారి సూర్య కిరణాల గాఢత కారణంగా కూడా పెదవుల చర్మం దెబ్బతింటుంది. పగుళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది.


Super Food : ఎర్ర రైస్ చేసే మేలు ఏమిటి.. దీనిని తీసుకుంటే..

నోటితో శ్వాస తీసుకోవడం పెదాలను హైడ్రేట్ గా ఉంచడానికి లిప్ బామ్ లు, లిప్ స్టిక్ లు కఠినమైన పదార్థాలు కలిగిన పేస్ట్ వాడటం కూడా కారణం కావచ్చు.

పొడిబారకుండా ఏం చేయాలి.

హైడ్రేటెడ్ గా ఉండడానికి రోజంతా నీరు పుష్కలంగా తాగాలి.

Children Health : వర్షాకాలంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో పిల్లల ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!

పెదాలను రక్షించుకునేందుకు బయటకు వెళ్లే ముందు SPFతో లిప్ బామ్ పూయాలి.

క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయలి. సున్నితమైన లిప్ బామ్ ఎంచుకోవాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 03 , 2024 | 01:55 PM