Curry With Aloe Vera : అలోవెరాతో కూర చేస్తారా? ఈ ప్రత్యేకమైన వంటకాన్ని గురించి తెలుసుకోండి..!!
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:47 PM
అలోవెరా అనేక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన మొక్క. దీనిని సౌందర్య ఉత్పత్తులలో మాత్రమే వాడేవారు. అయితే అలోవెరాతో వంటకాన్ని కూడా చేయచ్చనే విషయం కాస్త కొత్తగా అనిపించవచ్చు.
అలోవెరా జెల్, అలోవెరా జ్యూస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనకు తెలిసిందే.. ఇందులోని ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి. అలోవెరా అనగానే మన ఆరోగ్యంలో భాగంగా మారిపోయింది. గుండె ఆరోగ్యం నుంచి, జుట్టు పోషణ వరకూ రకరకాల విధానాల్లో అలోవెరాను వాడుతుంటాం. అయితే అలోవెరా కాడలతో వంటకాన్ని తయారుచేసే విధానం వినడం ఇదే ప్రధమం. అసలు ఈ ప్రక్రియ ఎలానో తెలుసుకుందాం.
అలోవెరా అనేక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన మొక్క. దీనిని సౌందర్య ఉత్పత్తులలో మాత్రమే వాడేవారు. అయితే అలోవెరాతో వంటకాన్ని కూడా చేయచ్చనే విషయం కాస్త కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే జిగురుగా ఉండే ఈ అలోవెరా వంటకంగా ఎలా చేస్తారనేది కొత్త సంగతే. ఈ రెసిపీలో జీలకర్ర, కొత్తిమీర, పసుపు, గరం మసాలా వంటి మసాలా దినుసులను కలిపి లేతగా ఉన్న కలబంద ఆకులను కలుపుతారు. ఈ మసాలా దినుసులు వంటకానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి.
అలోవెరా సబ్జీ చేయడానికి..
అలోవెరాతో సబ్జీ చేయాలంటే లేత కలబంద ఆకులను ఎంచుకోవాలి. ఈ ఆకులకు రెండు వైపులా ఉన్న ముళ్లను శుభ్రం చేసుకోవాలి.
Favorite Lipstick: లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..!
ఈ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. బాణలలో నీళ్లు పోసి మరిగేటప్పుడు అందులో కలబంద ముక్కలను వేయాలి.
అర టీస్పూను ఉప్పు, పసుపు వేసి మరికాసేపు ఉడికించాలి. తీయాలి.
Black salt : నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా? ఈ నీటిని తాగితే..
కడాయిలో నూనె వేసి ఇంగువ, జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు నూనెలో పచ్చిమిర్చి, కలబంద ముక్కలు వేసి మసాలా దినుసులతో చేసిన పొడిని చల్లి, కాసేపు తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి ఉడికించాలి. చిన్న బెల్లం కూడా వేసుకోవచ్చు. కాసేపు ఉడికిన తర్వాత దించుకోవాలి.
కలబంద దానిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు పేరు పొందింది. ఈ రుచికరమైన సబ్జీని టామాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిని జోడించడం వల్ల వంటకం రుచి కరంగా పోషక విలువలు మరింత పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన వంటకం.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.