Share News

Clay Pot Cooking: మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!

ABN , Publish Date - May 17 , 2024 | 11:55 AM

కొందరు పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా పుడితే వారిని ఇంక్యుబేటర్లో ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పసిబిడ్డలకు శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు.

Clay Pot Cooking: మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!
pot cooking

మట్టికుండలో ( pot cooking) వంటచేయడం అనేది ఒకప్పటి అలవాటు.. అది ఆరోగ్యపరంగా, అప్పటి పరిస్థితులు కారణంగా అలవాటుగా మారింది. మధ్యలో మన అలవాట్లు మట్టి కుండకు దూరంగా వచ్చేసాయి. మట్టిని మరిచిపోయి ఇత్తడి, అల్యూమినియం మీద పడ్డాం. నాన్ స్టిక్ వచ్చి వీటన్నింటినీ దూరంగా నెట్టేసింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా నాన్ స్టిక్ పెనాలు, మూకుళ్లే, కుక్కర్స్ కూడా వస్తున్నాయి. మరీ ఎక్కువగా వాటినే వాడేవాళ్ళు సడెన్గా యూటర్న్ తీసుకుంటున్నారు. ఆరోగ్య పరంగా ఆలోచిస్తున్నారు. పూర్వం వండుకున్న మట్టిపాత్రలే మేలనే నిర్ణయానికి వస్తున్నారు. నెమ్మదిగా ఒకనాటి కళకు ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యపరంగా అవగాహన కూడా పెరుగుతుంది. అయితే మట్టిపాత్రలో వండటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనేది తెలుసుకుందాం.

మట్టి వంటపాత్ర (pot) లో ఏకరీతిన వంట చేయడం వల్ల అది మట్టి రుచి జోడిస్తుంది. మంచి రుచి, సువాసనా పదార్థాలకు వస్తాయి. ఆహారం ఎక్కువ సేపు వేడిగా, తాజాగా ఉంటుంది. తరుచుగా వేడి చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ స్టవ్, ఓవెన్, గ్రిల్ లేదా మైక్రోవేవ్ మీద, త్రాగునీటిని నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. ఫ్రిజ్‌లో కూడా ఈ పాత్రలు పెట్టుకోవచ్చు.

మట్టి కుండలు భారతీయ సంప్రదాయంలో పాతుకుపోయిన ఓ పురాతన కాలం నుంచి వస్తున్న అలవాటు. అయితే నెమ్మదిగా వంటచేసే ప్రక్రియ ఆహారం రుచికి తగిన విధంగా మారుతూ వస్తుంది. నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీల్ పాత్రలు వచ్చాకా వీటిని మరిచిపోయారు దాదాపు. అయితే ఇప్పుడు మళ్ళీ కాలం వెనక్కు పరుగుపెడుతుంది. ప్రతి ఒక్కరూ కుండలోని భోజనాన్ని ఇష్టపడుతున్నారు.

1. మట్టి పాత్రలో వంటచేయడం వల్ల రుచి పెరగడమే కాదు, ఆహారం ఎక్కువ సమయం చెడిపోకుండా ఉంటుంది.

2. మన ఆరోగ్యానికి కావాల్సిన 18 రకాల మైక్రోన్యూక్లియన్స్ ఈ మట్టిలో ఉన్నాయి. మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన 100శాతం మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి.

Overeating Mangoes : మామిడి పండ్లను అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!


3. కానీ మామూలు పాత్రల్లో 7 శాతం, 13 శాతం మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి.

4. మట్టి పాత్రలను తయారు చేస్ బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్ కు వేడిని తట్టుకునే ఇన్ప్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి.

5. కొందరు పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా పుడితే వారిని ఇంక్యుబేటర్లో ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పసిబిడ్డలకు శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు.

జుట్టు, గోళ్లు పెరుగుదలకు బయోటిన్ ఎంత వరకూ అవసరం..!


6. ఇది కొన్ని గంటల్లోనే సాధ్యం అవుతుంది. అంతటి ఆరోగ్యం మట్టి కుండల్లోనూ ఉంది. ఇందులో వంట మనకు జీవితాంతం ఆరోగ్యాన్ని ఇస్తుంది. చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ మట్టిపాత్రల్లో వండిన ఆహారం తింటే డయాబిటిస్ కంట్రోల్లో ఉంటుంది.

7. సూక్ష్మ రంధ్రాలతో నీటిని చల్లబరిచే గుణం కూడా కుండకు ఉంది, కుండలో నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. గాలితో బాష్పోత్సేకం ప్రక్రియతో నీటిని చల్లబర్చుకోవడానికి మట్టిలోని సూక్ష్మరంధ్రాలు ఉపయోగపడతాయి.

మట్టిలో ఉండే క్షారగుణం ఆరోగ్యానికి చాలా మంచిది. గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా చేస్తుంది. అసిడిటీని తగ్గిస్తుంది. శరీరంలో పీహెచ్ నిల్వలను సమతుల్యం చేస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 17 , 2024 | 11:55 AM