Dopamine : శరీరంలో డోపమైన్ స్థాయిలను ఎలా పెంచాలో తెలుసా..!

ABN , First Publish Date - 2024-02-06T15:57:40+05:30 IST

డోపమైన్ మనలో కలిగే భావాలకు కారణం అవుతుంది.

Dopamine : శరీరంలో డోపమైన్ స్థాయిలను ఎలా పెంచాలో తెలుసా..!
Dopamine

డోపమైన్ అనేది మెదడులోని ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్, ఇది చురుకుదనం, దృష్టి, ఆనందం భావాలకు కారణం అవుతుంది. ఇది పుట్టిన ప్రతి సారీ ఆనందం కలుగుతుంది. ఇష్టమైన సంగీతం వినడం ద్వారా ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. అలాగే డోపమైన్ విడుదల చేస్తుంది. ఇది మానసికంగా ప్రశాంతంగా ఉండేలా మెదడు స్థితిని మెరుగుపరుస్తుంది.

డోపమైన్ మనలో కలిగే భావాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఉత్సాహాన్ని పెంచుతుంది. డోపమైన్ అగోనిస్ట్‌లు మెదడు సంబంధిత కదలిక రుగ్మతల నుండి ఋతు చక్రం అంతరాయాలకు కారణమయ్యే ఎండోక్రైన్ సమస్యల వరకు అనేక విభిన్న పరిస్థితులకు కారణం అవుతుంది. ఇది కనుక శరీరంలో తగ్గితే..

డోపమైన్ లోపం ఉంటే?

తక్కువ డోపమైన్ స్థాయిలు ఉంటే..

1. తగ్గిన చురుకుదనం

2. ఏకాగ్రత తక్కువగా ఉండటం.

3. ఏ పని మీదా ఉత్సాహం లేకపోవడం

4. పెద్దగా నలుగురిలో కలవలేకపోవడం.

5. శరీర కదలికలో ఇబ్బందులు

6. నిద్ర లేకపోవడం

డోపమైన్ స్థాయిలు తగ్గడం వల్ల..

డోపమైన్ స్థాయిలు తగ్గడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.


ఇది కూడా చదవండి: ఈ ఐదు రకాల మూలికలతోనూ జుట్టు పదిలం..!

పార్కిన్సన్స్ వ్యాధి; లక్షణాలు వణుకు, మందగించిన కదలికలు, కొన్నిసార్లు సైకోసిస్.

డిప్రెషన్; లక్షణాలు విచారం, నిద్ర సమస్యలు, ఆలోచనలో మార్పులు.

డోపమైన్ ట్రాన్స్పోర్టర్ లోపం సిండ్రోమ్; దీనినే ఇన్ఫాంటైల్ పార్కిన్సోనిజం-డిస్టోనియా అని కూడా పిలుస్తారు, ఈ పరిస్థితి పార్కిన్సన్స్ వ్యాధి మాదిరిగానే కదలిక ఇబ్బందిని కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - 2024-02-06T15:57:41+05:30 IST