Share News

Copper Vessel : రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..!

ABN , Publish Date - Apr 02 , 2024 | 03:33 PM

రాగిలో బ్యాక్టీరియాను చంపే గుణాలున్నాయి. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు, అల్సర్లు లేదా అజీర్ణానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ నీరు కడుపులోని అన్ని హానికరమైన బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది.

Copper Vessel : రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..!
copper toxicity

పూర్వం నీటిని ఇత్తడి, రాగి, మట్టి పాత్రలలోనే తాగేవారు, మరి ఇప్పుడో ఎటు చూసినా ఫ్లాస్టిక్ సీసాలే.. వాటిలోనే ఎక్కువగా తాగుతున్నాం. అయితే రాగి పాత్రల్లో నీటిని తాగేందుకు ఇప్పుడు మళ్ళీ ఆసక్తి చూపిస్తున్నారు. త్రాగునీటిని రాగి పాత్రల్లో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో ముఖ్యంగా..

జీర్ణక్రియను మెరుగవుతుంది..

రాగిలో బ్యాక్టీరియాను చంపే గుణాలున్నాయి. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు, అల్సర్లు లేదా అజీర్ణానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ నీరు కడుపులోని అన్ని హానికరమైన బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గాయం మానిపోతుంది..

రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి. రాగిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

బరువును తగ్గించడంలో..

రాగి పాత్రలో ఉంచిన నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పనిచేస్తుంది. బాడీ డిటాక్స్, ఇంటర్నల్ క్లీనింగ్ కు రాగి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. శరీరం కొవ్వు పేరుకుపోయి, ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

వేసవి సెలవుల్లో పిల్లలతో ఇలా ఫ్లాన్ చేయండి.. !!


చర్మం తాజాగా ఉంటుంది.

రాగి నీరు మెలనిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి మెలనిన్ పైకప్పు లాగా పనిచేస్తుంది. కాబట్టి చర్మంపై ముడతలు ఉండవు. వయస్సు ప్రభావం చర్మంపై కనిపించదు.

ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

కీళ్ళ నొప్పులు ఉండవు..

రాగిలో యాంటీ ఇంటర్నల్ లక్షణాలుంటాయి. ఇది కీళ్ల నొప్పుల సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే రాగి ఎముకలకు చాలా మంచిది. ఇది దానిని మరింత బలోపేతం చేస్తుంది. ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 03:33 PM