Share News

Eating disorders : పిల్లలు తినేందుకు ఇష్టపడటం లేదా.. ఇది చిన్న సమస్య కాదుమరి..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:25 PM

ఈ పరిస్థితి తినే రుగ్మతలు వంశపారంపర్యంగా ఉండే అవకాశం ఉంది. పిల్లల తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా బంధువు ఈటింగ్ డిజార్డర్‌ని కలిగి ఉన్నట్లయితే, ఇది పిల్లలలో 7-12 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

Eating disorders : పిల్లలు తినేందుకు ఇష్టపడటం లేదా.. ఇది చిన్న సమస్య కాదుమరి..!
eating disorder

పిల్లల ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. వాళ్ళు తినే ఆహారంలో పోషకాలు, విటమిన్స్ ఇలా అన్నీ సక్రమంగా సమాయనికి తగినట్టుగా తీసుకునేలా చూస్తాం. అయితే కొందరి పిల్లల్లో అతిగా తినే అలవాటు ఉంటుంది. కొందరిలో ఆహారం పట్ల విరక్తి కనిపిస్తుంది. తినాలని లేకపోవడం చూస్తూ ఉంటాం. ఈ లక్షణం నెమ్మదిగా పెరిగి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమస్య గురించి తెలుసుకుందాం.

పిల్లలలో తినే రుగ్మత, యుక్తవయస్సు వారిలోనూ, చిన్నవారిలోనూ కనిపిస్తూనే ఉంటుంది. దీనిని అనోరెక్సియా నెర్వోసా, బులిమియా నెర్వోసా అని అంటారు. ఈ తినే రుగ్మత రకరకాలుగా ఉంటుంది. పిల్లలు క్రమంగా బరువు తగ్గుతారు. శరీరంలో మార్పులు కూడా అలాగే ఉంటాయి. ఈ రుగ్మతకు కారణమయ్యే కారకాల్లో జన్యు సిద్ధత, సామాజిక ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. అలాగే కొందరిలో కనిపించే లక్షణం బరువు తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, దీనితో నలుగురిలో కలవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇప్పటి కాలంలో పిల్లలు, యుక్తవయస్సు వారు ఈటింగ్ డిజార్డర్స్ సమస్యగా మారింది. పిల్లలలో తినే రుగ్మతలు తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితులు, ఆహారం, శరీర ఆకృతి అనారోగ్య సంబంధాలు కనిపిస్తాయి. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి సకాలంలో స్పందించడం అవసరం.

కారణాలు, ప్రమాదాలు

తినే రుగ్మతలకు కారణమేమిటో పరిశోధకులు తేల్చే పనిలో ఉన్నారు. అయితే ఈ పరిస్థితి తినే రుగ్మతలు వంశపారంపర్యంగా ఉండే అవకాశం ఉంది. పిల్లల తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా బంధువు ఈటింగ్ డిజార్డర్‌ని కలిగి ఉన్నట్లయితే, ఇది పిల్లలలో 7-12 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు కూడా అధిక ప్రమాదంలో ఉన్నట్టే, ముఖ్యంగా ఇన్సులిన్-ఆధారిత డయాబెటిస్ మెల్లిటస్‌తో బాధపడుతున్నవారు. డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక అనారోగ్యంతో పోరాడుతున్న పిల్లలు కూడా ఎక్కువ ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: దాల్చిన చెక్క నీరుతో త్వరగా ఇలా బరువు తగ్గేయండి..!


పిల్లలలో ఈటింగ్ డిజార్డర్స్

1. ఎవాయిడెంట్, రిస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్‌టేక్ డిజార్డర్ (AFRID) అనేది చిన్నపిల్లలలో కనిపించే తినే రుగ్మత. AFRIDతో బాధపడుతున్న పిల్లలు ఆహారం పట్ల ఆసక్తి లేకపోవడాన్ని, కొన్ని ఆహారాల పట్ల ఇంద్రియ విరక్తితో ఉంటారు. ఉదాహరణకు, ఒకప్పుడు ఇష్టంగా తిన్న ఆహారాన్నితినడానికి ఇష్టపడకపోవచ్చు. ఏదైనా ఆహారం కారణంగా అనారోగ్యానికి గురైతే కడుపు నొప్పులు, వాంతులు వస్తాయని భయపడవచ్చు. ఈ విరక్తి, చిన్న పిల్లలలో బరువు తగ్గడానికి, పోషకాహార లోపానికి దారితీస్తాయి.

2. పికా అనేది ఒక రకమైన పరిస్థితి, పిల్లలు ఆహారం, పోషకాహార పదార్థాలను తిన్నా కూడా ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉంటారు. పికా వ్యాధి నిర్ధారణ కావాలంటే, ప్రవర్తన పిల్లల ఆశించిన అభివృద్ధి స్థాయికి వెలుపల ఉండాలి. ఆహారానికంటే కూడా ఈ పదార్ధాలను తినేందుకు మక్కువ చూపుతారు. అందులో తరచుగా ధూళి, సబ్బు, సుద్ద, ఇసుక, మంచు, వెంట్రుకలు ఉంటాయి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 11 , 2024 | 01:26 PM