Share News

copper vessel : రాగి సీసాలో నీటిని ప్రతిరోజూ తీసుకుంటే ..!

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:45 PM

రాగి పాత్రల్లో నిల్వ ఉన్న నీరు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇక రాగి సీసాలు మంచి ప్రాచుర్యం పొందాయి. ప్లాస్టిక్ బాటిల్స్ కి ప్రత్యామ్నాయంగా వాడుతున్న వీటిలో నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

copper vessel : రాగి సీసాలో నీటిని ప్రతిరోజూ తీసుకుంటే ..!
copper

పెరుగుతున్న ఆరోగ్యం మీది శ్రద్ధ మళ్ళీ వెనక్కు వెళ్ళేలా చేస్తుంది. ఇప్పుడు అంతా రాగి వస్తువుల్లోనే నీటిని తాగేందుకు చూస్తున్నారు. ఈనీరు ఆరోగ్యాన్ని పెంచుతుందని నమ్ముతున్నారు. రాగి పాత్రల్లో నిల్వ ఉన్న నీరు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇక రాగి సీసాలు మంచి ప్రాచుర్యం పొందాయి. ప్లాస్టిక్ బాటిల్స్ కి ప్రత్యామ్నాయంగా వాడుతున్న వీటిలో నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

రాగి సీసాలో నీళ్ళు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచుతుంది. అలాగే ఎముకలకు బలాన్నిస్తుంది.

ఇది కొల్లాడెన్ ఉత్పత్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

హానికరమైన బ్యాక్టీరియాను, వైరస్ లను చంపడంలో సహాయపడుతుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలను రాగి కలిగి ఉంటుంది.

మజ్జిగను తీసుకుంటే కడుపులో చల్లని ఫీలింగ్ కలుగుతుంది.. వేసవిలో ఇలా ట్రై చేయండి.


రాగి సీలాలు నీటిని సహజంగా చల్లగా, రిఫ్రెష్ గా ఉంచుతాయి. నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇది మరో కారణం.

రాగిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

లైట్ థెరపీ శరీరంలో చాలా మార్పులకు ఇది అవసరం.. ముఖ్యంగా నిద్రకు..!

ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని నెమ్మదించేలాస్తుంది.

మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయి.

థైరాయిడ్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడంలోనూ రాగి పాత్రలు జీర్ణ క్రియను పెంచి, బరువు తగ్గేలా చేస్తాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 08 , 2024 | 04:45 PM