Health Tips: ఈ నాలుగు పాటిస్తే మీ జీవితంలో రోగాలు అనేవే దరిచేరవు..!
ABN , Publish Date - Feb 11 , 2024 | 10:09 PM
Health Tips: ప్రస్తుత బిజీ యుగంలో.. జనాలు తమ ఆరోగ్యాలను పనంగా పెట్టి మరీ ఉద్యోగాల్లో నిమగ్నమైపోతున్నారు. సరైన సమయానికి ఆహారం తినక.. సరైన సమయానికి నిద్రపోక.. అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే, కొంత శ్రద్ధ వహిస్తే జీవితంలో రోగాల బారిన పడకుండా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి శరీరంలో రోగనిరోధక శక్తి అనేది చాలా కీలకం. కానీ, ప్రస్తుతం ప్రజలు అనుసరిస్తున్న జీవన శైలి కారణంగా..
Health Tips: ప్రస్తుత బిజీ యుగంలో.. జనాలు తమ ఆరోగ్యాలను పనంగా పెట్టి మరీ ఉద్యోగాల్లో నిమగ్నమైపోతున్నారు. సరైన సమయానికి ఆహారం తినక.. సరైన సమయానికి నిద్రపోక.. అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే, కొంత శ్రద్ధ వహిస్తే జీవితంలో రోగాల బారిన పడకుండా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి శరీరంలో రోగనిరోధక శక్తి అనేది చాలా కీలకం. కానీ, ప్రస్తుతం ప్రజలు అనుసరిస్తున్న జీవన శైలి కారణంగా.. రోగనిరోధక శక్తి అనేది క్రమంగా క్షీణిస్తోంది. దాంతో అనేక రోగాల బారిన పడుతున్నారు. రోగనిరోధక శక్తి అనేది శరీరానికి కవచంలా పని చేస్తుంది. అనేక రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలని, ఇందుకోసం లైఫ్‌స్టైల్‌లో కొన్ని అంశాలను పాటించాలన్నారు.
రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలు..
వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగిన.. వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: ఆరోగ్యకరమైన జీవితానికి పునాది సరైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. మన ఆహారంలో తాజా పండ్లు, పచ్చి కూరగాయలు, గింజలు, మొలకలు చేర్చుకుంటే.. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఇతర ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా అందుతాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
ఒత్తిడి నియంత్రణ: జీవితంలో ఒత్తిడి అనేది సాధారణ విషయం. కానీ అధిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మంచి మార్గం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. యోగా చేయడం, వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు.
కంటికి సరిపడా నిద్ర: మనిషి శరీరానికి నిద్ర చాలా అవసరం.. ఈ సమయంలో మన శరీరంలో మరమ్మత్తు, పునరుద్ధరణ ప్రక్రియలు చురుకుగా జరుగుతాయి. ప్రశాంతమైన, గాఢ నిద్ర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అందుకే.. సరిపడా నిద్రపోవాలి.