Food Combination: ఈ ఫుడ్ కాంబినేషన్స్ అస్సలు తినకండి.. విషం కంటే ప్రమాదం..!
ABN , Publish Date - Feb 11 , 2024 | 10:51 PM
Food Combination: కొన్ని ఆహార కలయికలు శరీరానికి ఒక వరంలా పని చేస్తే.. మరికొన్ని ఆహార కలయికలు తినడం ద్వారా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్ని ఫుడ్ కాంబినేషన్‌లు మనకు రుచికరంగా అనిపించడంతోపాటు ప్రయోజనకరంగానూ అనిపించినప్పటికీ.. కొన్ని ఫుడ్ కాంబినేషన్‌లు తినడం ప్రాణాంతకం కూడా అవుతుంది.
Food Combination: కొన్ని ఆహార కలయికలు శరీరానికి ఒక వరంలా పని చేస్తే.. మరికొన్ని ఆహార కలయికలు తినడం ద్వారా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్ని ఫుడ్ కాంబినేషన్‌లు మనకు రుచికరంగా అనిపించడంతోపాటు ప్రయోజనకరంగానూ అనిపించినప్పటికీ.. కొన్ని ఫుడ్ కాంబినేషన్‌లు తినడం ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకే.. కొన్ని ఫుడ్ కాంబినేషన్స్‌ని అస్సలు తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ కాంబినేషన్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
పాలు - సిట్రస్ పండ్లు..
నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ ఉంటుంది. ఇవి తిన్న వెంటనే పాలు తీసుకుంటే.. అవి విరిగిపోతాయి. తద్వారా శరీరంలో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
చేపలు - పాలు..
పాలు, చేపలు రెండూ విభిన్న స్వభావం కలిగిన ఆహారాలు. చేపలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. పాలు చలువ చేస్తాయి. వీటిని ఒకే సమయంలో తీసుకుంటే.. శరీరంలో రసాయన మార్పులకు కారణం అవుతుంది. చర్మంపై పిగ్మెంటేషన్ సమస్యలను కలిగిస్తుంది.
ఆహారం - పండ్లు..
ఆహారం తిన్న వెంటనే పండ్లను తింటే శరీరానికి అదనపు కేలరీలు అందుతాయి. అందుకే.. అన్నం తిన్న వెంటనే పండ్లను తినకూడదు. ఇది శరీరానికి హానీ చేస్తుంది.
కొవ్వు మాంసం, జున్ను..
సంతృప్త కొవ్వు ఉన్న మాంసంతో పాటు చీజ్ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వు, సోడియం ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
చీజీ ఫుడ్ - శీతల పానీయాలు..
నేడు ప్రతి ఒక్కరూ చీజీ ఫుడ్‌తో పాటు.. కూల్ డ్రింక్స్ కూడా తాగుతున్నారు. రుచిగా ఉంటుందనే కారణంగా అన్నీ లాగించేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని కారణంగా కడుపు నొప్పి, ఇతర సమస్యలతో బాధపడవలసి ఉంటుంది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులకు చూపించుకోవడం ఉత్తమం.