Muscle Pain : వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గించడానికి 7 మార్గాలు ఇవే..
ABN , Publish Date - Jun 05 , 2024 | 03:41 PM
ఐస్ ప్యాక్ ఉపయోగిస్తే ఈ నొప్పి సమస్య తగ్గుతుంది. కండరాలు లేదా కీళ్ల వాపును ఐస్ ప్యాక్ తో తగ్గించుకోవచ్చు. నొప్పి కండరాలపా 15 నిమిషాల పాటు ఉంచి తీయవచ్చు. వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గేందుకు, రక్త ప్రసరణ పెంచడానికి 15 నిమిషాల పాటు హీట్ ప్యాక్ కూడా పెడుతుండాలి.
శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యాక్టివ్ రికవరీ వర్కౌట్లు కండరాల నొప్పిని తగ్గించడంలో సహకరిస్తాయి. యాక్టివ్ రికవరీ కోసం వ్యాయామాలు మంచి ఫీల్ ఇస్తాయి. అథ్లెట్స్, అప్పుడప్పుడూ వ్యాయామం చేసే వారేవరైనా, కఠినమైన వ్యాయామం తర్వాత కండరాల నొప్పి ఉంటుంది. ఈ నొప్పిని యాక్టివ్ రికవరీ వర్కవుట్ తో వేగంగా మెరుగ్గా చేసుకోవచ్చు. కండరాలు పట్టేసినట్టుగా,
యాక్టివ్ రికవరీ వర్కవుట్‌లు సమయాన్ని ఎక్కువ సమయం అవసరం లేదు. తీవ్రమైన వ్యాయామం వల్ల శరీరం త్వరగా అలిసిపోతుంది. అలసిపోయినట్టుగా మొదట్లో అనిపించినా, నెమ్మదిగా అలవాటు అవుతుంది. కండరాల మీద బలం పెట్టినప్పుడు అవి ఉబ్బుతాయి. అయితే ఎక్కువ తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు కండరాలు నొప్పిగా మారినా కూడా సాగి, బంలగా మారతాయి. ఇది తేలికపాటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
Health Benefits : వేసవిలో వచ్చే తాటి ముంజులతో ఎన్ని ఉపయోగాలంటే.. !
వ్యాయామం చేసిన తర్వాత ..
ఐస్ ప్యాక్ ఉపయోగిస్తే ఈ నొప్పి సమస్య తగ్గుతుంది. కండరాలు లేదా కీళ్ల వాపును ఐస్ ప్యాక్ తో తగ్గించుకోవచ్చు. నొప్పి కండరాలపా 15 నిమిషాల పాటు ఉంచి తీయవచ్చు. వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గేందుకు, రక్త ప్రసరణ పెంచడానికి 15 నిమిషాల పాటు హీట్ ప్యాక్ కూడా పెడుతుండాలి.
Weight Loss : బరువు తగ్గడానికి 10 కొవ్వు పదార్థాలు..
మసాజ్ కోసం..
మసాజ్ కండరాల బిగుతుగా ఉండటాన్ని తగ్గిస్తుంది. ఇది కండరాలను విశ్రాంతి మోడ్ లోకి తీసుకుని వెళుతుంది.
నరాలకు వ్యాయామం..
బాగా కఠినమైన వ్యాయామం తర్వాత కండరాలను సాగదీయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
తేలికపాటి వ్యాయామాలు..
వ్యాయామం పూర్తి ఆపవద్దు. వ్యాయామం తర్వాత కండరాల నొప్పులను చిన్న చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు. వ్యాయామం తర్వాత నొప్పులు ఉంటాయి. వాటిని తప్పించుకోవాలంటే కాస్త సులువైన పద్దతులను పాటిస్తేసరి. ఇవి శరీరాన్ని యాక్టివ్ చేస్తాయి. కాళ్లకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. మెరుగైన రక్త సరఫరాను అందిస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.