Refrigerator : పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏవి..!
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:52 PM
ఫ్రిజ్‌లో కొన్ని వస్తువులు పెట్టకూడదు. ఇది అందరికీ తెలిసిన సంగతే అయితే పదే పదే అదే పని చేస్తూ ఉంటాం. ఆహార పదార్ధాలు, కూరగాయలు, నీళ్లు, పాలు పెరుగు వరకూ ఓకే కానీ ఏది పడితే అది ఫ్రిజ్ లో పెట్టేసి ఎప్పుడో గుర్తు వచ్చినపుడు తీసుకోవడం వడటం ఇవన్నీ ఆరోగ్యానికి చేటే..
ఫ్రిజ్‌లో కొన్ని వస్తువులు పెట్టకూడదు. ఇది అందరికీ తెలిసిన సంగతే అయితే పదే పదే అదే పని చేస్తూ ఉంటాం. ఆహార పదార్ధాలు, కూరగాయలు, నీళ్లు, పాలు పెరుగు వరకూ ఓకే కానీ ఏది పడితే అది ఫ్రిజ్ లో పెట్టేసి ఎప్పుడో గుర్తు వచ్చినపుడు తీసుకోవడం వడటం ఇవన్నీ ఆరోగ్యానికి చేటే.. అసలు ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలు ఏవంటే.. !
పుచ్చకాయ...
పుచ్చకాయలు వేసవి రాగానే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. దీనిని కాస్త తిని మిగతాది ఫ్రిజ్ లో పెడతాం. ఇలా పెట్టడం వల్ల దానిలోని పోషకాల శాతం తగ్గుతుంది. అందుకని పుచ్చకాయ పెద్ద ముక్కని ఫ్రిజ్ లో పెట్టడం కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసి బాక్స్ లో పెట్టి అప్పుడు ఫ్రిజ్ లో పెట్టడం మంచిది.
ఉల్లిపాయలు..
మనం వంటకి ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోయడం చేస్తూ ఉంటాం. అయితే కాసిని మిగిలిన ముక్కల్ని తీసుకెళ్ళి ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల దాని వాసన ఫ్రిజ్ మొత్తం వ్యాపిస్తుంది. ఇంతకన్నా ఎప్పటి ఉల్లిపాయ ముక్కల్ని అప్పుడే ఫ్రిపేర్ చేసుకోవడం మంచిది.
బంగాళదుంప...
బంగాళాదుంపలను చల్లటి ప్రదేశంలో ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అందులో చెక్కర శాతం ఎక్కువగా పెడుగుతుంది. దీనివల్ల కూరలో రుచి మారిపోతుంది.
తేనె..
ఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం తేనె, దీనిని ఫ్రిడ్జ్‌లో అసలు ఉంచకండి దానివల్ల తేనె రుచి మారుతుంది.
ఆకలిని తగ్గించుకోడానికి అందమైన పువ్వులను తినే జంతువుల గురించి తెలుసా..!
అరటి పండ్లు..
అరటి పండ్లని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. దీని వల్ల అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి.
పువ్వులు..
పువ్వులని అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు , వీటి వాసన వల్ల ఫ్రిడ్జ్‌లో ఉండే ఇతర ఆహారాల పైన ప్రభావం పడుతుంది.
ఇవి కూడా చదంవండి:
వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!
పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!
కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!
ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..
పచ్చళ్ళు..
కాలానికి తగ్గట్లు పచ్చళ్ళు పెట్టుకుని నిల్వ ఉంచేందుకు ఫ్రిజ్ లో పెడతారు ఇవి చెడి పోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చళ్లను ఫ్రిజ్ లో ఉంచడం సరైన విషయం కాదు.
బ్రెడ్ పాకెట్..
ఓపెన్ చేసాక మిగిలి పోయినది ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం .దీనివల్ల బ్రెడ్ గట్టి పడి తినలేం. దీనిని ఫ్రిజ్ లో పెట్టాలంటే కవర్లో పెట్టి ఉంచాలి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.