Share News

Acidity : గుండెల్లో మంట, ఎసిడిటీని పెంచే ఆహారాలివే..!

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:01 PM

ఆహారం తీసుకున్న ప్రతిసారీ ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. ప్రాసెస్ చేసిన పదార్థాలు చిప్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉప్పు, మొక్కజొన్న, బంగాళదుంప, అధిక స్థాయిలో ఉంటాయి. సోడియం అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన పాకెజ్ పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా అసిడిటీ ఎక్కువగా ఉంటుంది.

Acidity : గుండెల్లో మంట, ఎసిడిటీని పెంచే ఆహారాలివే..!
acidity

ఓ వయసుకు వచ్చాకా అన్నం సరిగా జీర్ణం కాకపోవడం, కడుపులో ఇబ్బంది వంటివి తప్పవు. కానీ.. ఇప్పటి రోజుల్లో కడుపులో మంట (acidity) అనేది, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం అనేది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్న సమస్య. కొన్ని సార్లు ఈ సమస్య ఎలా ఉంటుందంటే గుండెల్లో మంటగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం, చికాకు, అశాంతి ఇలా చాలా ఇబ్బందులకు లోనవుతారు. గుండెపోటు సూచనలు కూడా కనిపిస్తాయి. రాత్రి భోజనం తర్వాత గుండె మంటతో బాధపడే వారిని తీసుకుంటే వీరిలో ఆహారమే ప్రధాన కారణంగా తేలింది.

ఇలా రాత్రి సమాయాల్లోనే కాదు.. ఆహారం తీసుకున్న ప్రతిసారీ ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. ప్రాసెస్ చేసిన పదార్థాలు చిప్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉప్పు, మొక్కజొన్న, బంగాళదుంప, అధిక స్థాయిలో ఉంటాయి. సోడియం అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన పాకెజ్ పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా అసిడిటీ ఎక్కువగా ఉంటుంది.

గుండెల్లో మంట కలిగించే ఆహారాలు ఇవే..

1. రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా సమస్య ఉంటుంది. పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకున్న సమస్య ఉంటుంది.

2. దీనికి తోడు రాత్రి సమయాల్లో ఆరంజ్ జ్యూస్, సోడా వంటివి, పాలు, పాల పదార్థాలతో కూడా అజీర్ణం సమస్య ఉంటుంది. పాల పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపులో అసిడిటీ పెరిగే అవకాశం ఉంది.

ఈ తెరచాపలు కూలర్ కన్నా చల్లదనాన్ని ఇస్తాయి.. వేసవిలో వట్టివేరు ఉపయోగాలెన్నో... !!


3. కోడి గుడ్డు రాత్రి సమయంలో తీసుకున్నా అందులోని పచ్చ సొన కారణంగా అజీర్ణం, అసిడిటీ సమస్య వస్తుంది.

ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

4. కెఫీన్ ఉండే కాఫీ, టీ వంటి పదార్థాలను తీసుకోకూడదు. ఇవి అసిడిటీని పెంచుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ లేదా చమోమిల్ టీ ని తాగడం మంచిది.

5. కృత్రిమ పంచదారను తీసుకున్నా కూడా రాత్రి సమయంలో ఇబ్బంది అనిపిస్తుంది. బరువు పెరిగే సమస్య, అసిడిటీ వస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 04 , 2024 | 01:02 PM