Share News

High Cholesterol : కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఆరోగ్య అలవాట్లు...!

ABN , Publish Date - Feb 14 , 2024 | 03:55 PM

వారంలో కనీసం 30 నిమిషాల పాటు చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ చేయాలి.

High Cholesterol : కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఆరోగ్య అలవాట్లు...!
cholesterol

గుండె ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా చేర్చుకోవాలి. వాటిలో ముఖ్యంగా..

1. కరిగే ఫైబర్ తీసుకోవడం వల్ల

కొలెస్ట్రాల్ స్ఠాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కరిగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలలో ఓట్స్, బార్లీ, బీన్స్, కాయ ధాన్యాలు, యాపిల్, నారింజ, స్ట్రాబెర్రీలు చేర్చాలి.

2. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

రెడ్ మీట్, గుడ్డు సొనలు వంటి కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చగ్గించాలి.. బదులుగా లీన్ ప్రోటీన్ తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఇంగువను ఆహారంలోనే కాదు.. ఆరోగ్యం కోసమూ వాడచ్చు..

3. తక్కువ కొవ్వుపాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.

సంతృప్తి కొవ్వులు తీసుకోవడం తగ్గించడానికి తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

4. ఫ్యాటీ షిష్ తినాలి..

సాల్మాన్, మాకేరెల్, ట్రౌట్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలను ఆహారంలో తీసుకోవాలి. ఈ చేపలలో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్ లను తగ్గిస్తుంది.


5. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి..

వారంలో కనీసం 30 నిమిషాల పాటు చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ చేయాలి. వ్యాయామం HDl కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె ఆరోగ్యానికి మంచిది.

6. ఆరోగ్యకరమైన బరువు..

సమతుల్య ఆహారం, సాధారణ వ్యాయామ దినచర్యను అనుసరించడం, ఆరోగ్యకరమైన బరువు ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అధిక బరువు కోల్పోవడం, ముఖ్యంగా నడుము చుట్టూ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.

7. ధూమపానం వదిలేయండి..

ధూమపానం HDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తనాళాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం మానేయడం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

8. ఆల్కహాల్ పరిమితం చేస్తే..

అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. బరువు పెరగడానికి కారణం అవుతుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులకు చూపించుకోవడం ఉత్తమం.

Updated Date - Feb 14 , 2024 | 04:07 PM