Share News

Helth Benefits : జీర్ణ సమస్యలను సాఫీ చేసే చినా సీడ్స్ వీటితో ఇంకా ఎన్ని ప్రయోజనాలో..!!

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:38 PM

చియా గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఖనిజాలు, పోషకాహార పదార్థాలుగా పనిచేస్తాయి. ఇవి ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 వంటి ఆమ్లాలను కలిగి ఉన్నాయి. వీటితోపాటు కాల్షియం,. మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి. వివిధ శరీరక రుగ్మతలను నయం చేస్తాయి.

Helth Benefits : జీర్ణ సమస్యలను సాఫీ చేసే చినా సీడ్స్ వీటితో ఇంకా ఎన్ని ప్రయోజనాలో..!!
Helth Benefits :

చియా విత్తనాలు ఆరోగ్యాన్ని అందించడంలో ముందుంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. చియా సీడ్స్ రాత్రి నానబెట్టి ఉదయాన్నే పాలు, పండ్ల రసాలు, గ్రీన్ టీ, లెమన్ టీ, సలాడ్స్ లలో కలపవచ్చు. దీనితో ఎంతో ఆరోగ్యం. ఇంకా ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయంటే..

చియా విత్తనాలు అన్ని రకాల విత్తనాలలో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు దీనితో అందుతాయి. ఇటీవలి కాలంలోనే చియా సీడ్స్ ప్రాచుర్యం పొందాయి. అంతక మునుపు ఈ విత్తనాల గురించి పెద్దగా తెలీదు జనాలకు. ఇప్పుడిప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు అందుతున్నాయి.

ఇటీవలి సంవత్సరాలలో చియా విత్తనాలు చాలా ప్రాచుర్యం పొందాయి. చియా గింజలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

అవసరమైన పోషకాలతో నిండి ఉన్నాయి.

చియా గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఖనిజాలు, పోషకాహార పదార్థాలుగా పనిచేస్తాయి. ఇవి ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 వంటి ఆమ్లాలను కలిగి ఉన్నాయి. వీటితోపాటు కాల్షియం,. మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి. వివిధ శరీరక రుగ్మతలను నయం చేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు..

చియా విత్తనాలలో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహకరిస్తాయి.

యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు..

దార్ఘకాలిక మంట గుండె జబ్బుల సమస్యలను చియా గింజల్లో యాంటీ ఆక్సిడంట్లు తగ్గిస్తాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి.


Asheagandha Health : ఆరోగ్యాన్ని మార్చేసే ఆయుర్వేద మూలికల గురించి తెలుసా .. !

గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు, వాపు తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి.

ఎముకల ఆరోగ్యానికి మంచిది.

చియా గింజల్లో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఎముకల ఆరోగ్యానికి అవసరం. ఇందులోని పోషకాలు బలమైన ఆరోగ్యకరమైన ఎముకలను అందిస్తాయి. బోలు ఎముకల వ్యాధిని తగ్గించేందుకు సహకరిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు..

చియా గింజలలోని కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో పాత్ర పోషిస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 07 , 2024 | 04:38 PM