Monsoon : వానాకాలం వచ్చిందంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..!
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:41 PM
వానాకాలం మొదలు కాగానే పడే వానలు అప్పటి వరకూ పడిన ఎండల కారణంగా కాస్త హాయిగానే అనిపిస్తాయి. కానీ ఎడతెరిపి లేకుండా వానలు కురిస్తేనే అసలు ఇబ్బందులు మొదలవుతాయి. ఆరోగ్యా సమస్యలు కూడా అక్కడినుంచే మొదలయ్యేది.
కాలం మారుతుందంటే వాతావరణంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. దీనితో కొన్ని ఇబ్బందులూ తప్పవు. చాలా వరకూ పిల్లలకు వాతావరణ మార్పులతో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎండైనా, చలి, వాన ఇలా ఏ కాలమైనా కూడా ఇంటి విషయంలోనూ, శరీర విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చాలా వరకూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది వాతావరణానికి తగినట్టుగా ఉంటూనే సాధ్యం అవుతుంది. శాఖాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మాంసాహారం తినటం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.
వానాకాలం మొదలు కాగానే పడే వానలు అప్పటి వరకూ పడిన ఎండల కారణంగా కాస్త హాయిగానే అనిపిస్తాయి. కానీ ఎడతెరిపి లేకుండా వానలు కురిస్తేనే అసలు ఇబ్బందులు మొదలవుతాయి. ఆరోగ్యా సమస్యలు కూడా అక్కడినుంచే మొదలయ్యేది. చుట్టూ నిలిచిపోయిన వర్షం నీటి కారణంగా వచ్చే అనారోగ్యాలకైతే లెక్కే ఉండదు. తాగే నీరు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక కాచి చల్లాల్చిన నీటిని మాత్రమే వానాకాలంలో తీసుకుంటూ ఉండాలి.
నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. తినే ఆహారం విషయంలో కూడా తగిన శ్రద్ధ అవసరం. మార్కెట్లో తయారయ్యే తినుబండారాలను దూరం ఉంచడమే మంచిది. ఈ కాలంలో శుభ్రంగా లేని వంటకాలు వెంటనే పొట్టమీద ప్రభావాన్ని చూపుతాయి. అనారోగ్యం పాలు చేస్తాయి. ఇంట్లో తయారు చేసిన వంటకాలను, ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందినట్టే. చల్లారిన ఆహార పదార్థాలను వానా కాలంలో తీసుకోకూడదు. గోరువెచ్చగా తీసుకోవడమే మంచిది.
Liver Health : కాలేయంలో వాపు వస్తే కనుక సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
1. శాఖాహారాన్ని తీసుకునేట్టయితే మంచి కూరగాయలను తీసుకోవాలి. ఈ కాలంలలో ఆకు కూరలను దూరం పెట్టడం మంచిది. ఇక మాంసాహారాన్ని తినే వారైతే త్వరగా జీర్ణం కావడానికి కాస్త ముందుగా భోజనం చేయడం మంచిది.
2. వానాకాలంలో పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. లేదంటే వాన నీళ్ళు నిలిచిపోయి దోమలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దోమ తెరలను వాడటం మంచిది. లేదంటే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
Asheagandha Health : ఆరోగ్యాన్ని మార్చేసే ఆయుర్వేద మూలికల గురించి తెలుసా .. !
వ్యక్తిగత శుభ్రత కూడా అంతే అవసరం. మూత్ర విసర్జనకు ముందు తరువాత చేతులు శుభ్రంగా కడుకుంటూ ఉండాలి. చేతులను శుభ్రం చేసుకునేందుకు లిక్విడ్ తప్పనిసరి. దీర్ఘకాలంగా ఇన్ ఫెక్షన్లతో బాధపడేవారు వానల్లో తడవకపోవడం మంచిది. లేదంటే నిమోమనియా వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకోకుండా ఉండాలి. ఇంటి లోపల కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. దుస్తులు ఉతికే విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి, వానాకాలం దుస్తులు త్వరగా ఆరే అవకాశం ఉండదు కనుక ఎక్కువరోజులు పొడిగా ఉండే విధంగా గాలికి ఆరనివ్వాలి.. ఇటు వంటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలం ఆరోగ్యం పధిలంగా ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.