Over Thinking : మరీ ఆలోచిస్తే ఇబ్బంది తప్పదా.. ఆలోచన మానుకోవాలంటే.. !
ABN , Publish Date - Jul 13 , 2024 | 01:06 PM
తలమీద భారాన్ని పెంచుకునేది ఆలోచన తోనే, భవిష్యత్ గురించైనా, అతిగా ఆలోచించడం అనేది చేటే.. అతిగా ఆలోచించడాన్ని ఆపడానికి ప్రభావవంతమైన మార్గాలు లేకపోలేదు. గతానికి, వర్తమానానికి ముడి పెట్టి ఆలోచించే వాళ్ళకు అధిక ఒత్తిడిని కలిగిస్తాయి.
ఏ పని చేయాలన్నా ఆలోచన తప్పదు. పని చేయకూడదన్నా ఆలోచనే.. మన ప్రతి చర్యకూ ముందు ఆలోచన అనేది ఉంటుంది. ఆలోచన లేనిదే ఏ పనీ చేయం. అయితే ఈ ఆలోచన అనేది మరీ ఎక్కువైపోతే మాత్రం కష్టమే. మెదడు మీద మరింత భారం పడుతుంది. చిన్నగా మొదలైన ఒత్తిడి పెద్దగా మారి మొత్తం ఆరోగ్యాన్నే తినేస్తుంది. అందుకే ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. ఈ ఒత్తిడి తట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.
తలమీద భారాన్ని పెంచుకునేది ఆలోచన తోనే, భవిష్యత్ గురించైనా, అతిగా ఆలోచించడం అనేది చేటే.. అతిగా ఆలోచించడాన్ని ఆపడానికి ప్రభావవంతమైన మార్గాలు లేకపోలేదు. గతానికి, వర్తమానానికి ముడి పెట్టి ఆలోచించే వాళ్ళకు అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. అతిగా ఆలోచించడం అనేది మానసికంగా కూడా ఇబ్బంది పెడుతుంది.
Sleeping Risk : నిద్ర సరిగా లేకపోతే గుండె సమస్యలు తప్పవా..!
మైండ్ ఫుల్ నెస్ ఇలా ప్రాక్టీస్ చేయండి.
లోతైన శ్వాస, ధ్యానం చేయడానికి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు కేటాయించాలి. ఆలోచనలను, భావోద్వేగాల నుంచి మరింత తెలుసుకోవడం కూడా సహకరిస్తుంది. వాటిలో పడిపోకుండా అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి.
వర్రీ వద్దు..
ఆందోళన చెందకుండా ప్రతికూల విషయాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండేందుకు చూడాలి.
చురుగ్గా ఉంటే సరి..
శారీరక శ్రమ శరీరానికి మాత్రమే కాకుండా వ్యాయామం అవసరం. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది.
Women Health : గర్భిణీలకు ఎంత సమయం నిద్ర కావాలి.. సరైన నిద్ర లేకపోతే.. !
అతిగా ఆలోచించడం అనేది ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుందేమో గమనించుకోవాలి. మంచి అభిరుచుల ద్వారా సమయాన్ని గడిపేందుకు చూడాలి. స్నేహితలను కలవడం, వారితో సమయాన్ని గడపడం వంటివి మరీ ఆలోచించకుండా చేస్తాయి. అలాగే ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నా కూడా ఎక్కువగా ఆలోచించేందుకు సమయం ఉండదు. పనిలో పడిపోతే ఆలోచనలతో వచ్చే ఒత్తిడి కూడా దూరం అవుతుంది. ప్రతిదానికి చింత పడటం, ఆలోచించడం వంటివి తగ్గాలంటే కుటుంబంలో ఎవరితోనైనా మాట్లాడుతూ మనసులో భావాలను పంచుకుంటూ ఉండాలి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.