Health Tips : ఎయిర్ పాడ్స్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..!
ABN , Publish Date - Jul 25 , 2024 | 01:12 PM
ఇయర్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్ వాడుతుంటాం. సంగీతాన్ని చక్కగా ఆస్వాదించేలా వీటిని తయారు చేశారు.
కమ్మని పాటలు వినాలంటే ఒకప్పుడు రేడియోలు, గ్రామ్ ఫోన్లు వాడేవారు. కాలం మారుతూ సాంకేతికత బాగా పెరిగిపోయాక, సెల్ ఫోన్లే ప్రధానం అయ్యాయి. టీవీ, రేడియో, వాయిస్ రికార్డర్, మ్యూజిక్ సిస్టమ్, కెమెరా ఇలా అన్ని పరికరాలను సెల్ ఫోన్లోనే వాడుతున్నాం. ఇక పాటను వినసొంపుగా, ఇతరులకు ఇబ్బంది లేకుండా వినాలంటే మాత్రం ఇయర్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్ వాడుతుంటాం. సంగీతాన్ని చక్కగా ఆస్వాదించేలా వీటిని తయారు చేశారు. పాటలు వినడానికే వీటిని వేల రూపాయలు పెట్టి కొనేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఎక్కువ కాలం వీటిని ఉపయోగించేవారిలో కొన్ని రోజులకు వినికిడి సమస్యలకు గురి అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ ఎయిర్ పాడ్‌ల ద్వారా విడుదలయ్యే విద్యుదయస్కాంత వికిరణాలే కారణమంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కారణంగా క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతలు, పునరుత్పత్తి లోపాలు, జ్ఞాపకశక్తి సమస్యలు విద్యుదయస్కాంత క్షేత్రాల కారణంగా ఈ రోగాలు సంభవిస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే.. సాంకేతికత ఎంత పెరిగినా ఎలక్ట్రిక్ పరికరాల నుండి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా మనిషి శరీరానికి హాని కలిగిస్తోంది. ఏ వస్తువైనా అతిగా వాడితే దానితో కలిగే అనర్థాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ ఎంత సౌకర్యవంతమైన పరికరమో, అన్ని అనారోగ్య ఇబ్బందులను కూడా తెచ్చి పెడుతుంది. సెల్ ఫోన్, ఎయిర్ పాడ్స్ విషయంలో ఈ మధ్యకాలం జరిగిన పరిశోధనల్లో ఏం తేలిందంటే..
ఎయిర్ పాడ్‌లను ఉపయోగించడంలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్( IARC) సెల్ ఫోన్స్, వైర్ లెస్ పరికరాల ద్వారా విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్రాల కారణంగా క్యాన్సర్ కారకాలు బయటపడే అవకాశం ఉందని తేల్చింది.
Health Tips : నాన్‌స్టిక్ పాత్రల్లో వంట తింటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టేనా..!
ఇన్ని పరిశోధనలు జరిగినప్పటికీ ప్రమాదకర ఇబ్బందులు ఏర్పడతాయని ఎక్కడా సరైన ఆధారాలు లేవని తెలిపింది. అయితే తక్కువ సమయం ఎయిర్ పాడ్‌లను వాడటం వల్ల ఎక్కువ రిస్క్ ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. పాటలు వినడం అయ్యాక శరీరానికి ఎయిర్ పాడ్‌లను దూరంగా ఉంచడం, ఎక్కువసేపు శరీరం మీద ఉండకుండా చూసుకోవడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచించారు.
Health Benefits : పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది..!
ఇక బ్లూటూత్ హెడ్ ఫోన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను విడుదల చేస్తాయి. ఇవి సెల్ ఫోన్‌ల ద్వారా విడుదలయ్యే వాటి కంటే చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వైద్యులు చెప్పే సూచనలు పాటించి ఎయిర్ పాడ్ వినియోగాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.