Share News

Smoking Habits : ధూమపానంతో క్యాన్సర్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా.. దీనికి కారణాలేంటి..!

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:45 PM

50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో అధికంగా ధూమపానం చేసేవారిలో స్ట్రోక్ రిస్క్ రెండింతలు పెరిగిందని, 70 ఏళ్ళ వారిలో 1.5 రెట్లు పెరగడంతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంటుందట.

Smoking Habits : ధూమపానంతో క్యాన్సర్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా.. దీనికి కారణాలేంటి..!
health

ధూమపానం చాలామందిలో ప్రమాదమని తెలిసినా ఉండే అలవాటు ఇది. అధికంగా ధూమపానం చేయండ వల్ల అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. పొగ తాగేవారికే కాదు పొగను పీల్చేవారిలో కూడా వ్యాధులు తప్పవు. దీని కారణంగా క్యాన్సర్, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెదడుకు తగినంత రక్త ప్రసరణను అందించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇటీవలి అధ్యయనాల్లో ధూమపానం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది.

80 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం వల్ల వస్తుంది. అయినప్పటికీ ధూమపానం నోటి, స్వరపేటిక, ఫారింక్స్ అన్నవాహిక, మూత్రపిండాలు, ధూమపానం, కాలేయం, గర్భాశయం, ప్యాంక్రియస్, కడుపు, మూత్రాశయం వంటి ఇతర క్యాన్సర్లు ప్రమాదం కూడా పెంచుతుంది.

ధూమపానం చేసేవారిలో కనిపించే సాధారణ వ్యాధులలో ఒకటి, బ్రోన్కైటిస్.

ఎంఫిసెమాకు ధూమపానం ప్రధాన కారణం, ఎంఫిసెమా అనేది ఊపిరితిత్తుల వ్యాధి.

క్రానిక్ అబ్ర్ట్సక్టివ్ పల్మనరీ డిసీజ్.. COPD అనేది క్రానిక్ బ్రోన్కైటిస్, ఎంఫిసెమాను కలిగిఉంటుంది. శ్వాస ఇబ్బంది, దగ్గు, గురకకు కారణం అవుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవకాశం ఉంటుంది.

Collagen Levels : కొల్లాజెన్ శరీరానికి ఎంతవరకూ అవసరం.. దీనిని ఎలా తీసుకోవాలి..!


ధూమపానం కారణంగా పొగాకు పొగకు గురికావడం, వారానికి పది గంటల కంటే ఎక్కువ సేపు స్ట్రోక్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ఇస్కీమిక్, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ఇది మెదడు లోని రక్త నాళాలు పగిలిపోతాయి. ముఖ్యంగా 50 ఏళ్లలోపు వారు రోజుకు 20 సిగరెట్లు తాగుతుంటే మాత్రం స్ట్రోక్ రిస్క్ రెండింతలు అయ్యే అవకాశం ఉంటుంది.

50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో అధికంగా ధూమపానం చేసేవారిలో స్ట్రోక్ రిస్క్ రెండింతలు పెరిగిందని, 70 ఏళ్ళ వారిలో 1.5 రెట్లు పెరగడంతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంటుందట.

Super Food : రాగులతో బరువు తగ్గడం సులువే.. దీనితో ఇంకా బోలెడు లాభాలు..!

ధూమపానంతో..

1. ధూమపానం ఊపిరి పీల్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. జీవిత నాణ్యతను తగ్గిస్తుంది.

2. చర్మం వేగంగా వృద్ధాప్యం, ముడతలు, మచ్చలకు దారితీస్తుంది.

3. మధుమేహం, బోలు ఎముకల వ్యాధఇ, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటాయి.

4. కంటి శుక్లం, మచ్చలు, డ్రై ఐ సిండ్రోమ్ వంటి సమస్యలు రావచ్చు.

5. చిగుళ్ల వ్యాధి, దంత క్షయం, నోటి దుర్వాసన, దంతాల నష్టం, నోటి క్యాన్సర్ వంటి అనారోగ్యాలు వస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 12 , 2024 | 12:48 PM