Kalonji Seeds : కలోంజి విత్తనాలతో థైరాయిడ్ సమస్యను తగ్గించవచ్చు.. అదెలాగంటే..!
ABN , Publish Date - Jan 17 , 2024 | 11:12 AM
బ్లడ్ షుగర్ లెవెల్స్.. అదుపులో ఉండాలంటే కలోంజిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి.
చూసేందుకు చిన్న పాటి ఆకారంలో కనిపిస్తున్న ఈ కలోంజి నల్ల విత్తనాలు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. కలోంజి విత్తనాలు ముఖ్యంగా మన ఆరోగ్యానికి ఎలాంటి సపోర్ట్ ఇస్తాయంటే.. చర్మ సమస్యలలో ముఖ్యంగా సోరియాసిస్, మొటిమలు ఉన్నా కలోంజి విత్తనాలు చక్కని పరిష్కారంగా సహాయపడతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలున్నాయి. ఇవి చర్మ సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడతాయి. ఇంకా కలోంజితో ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే..
బరువు తగ్గడానికి..
బరువు తగ్గడానికి ఆహారంలో మార్పులు చేయాలి, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం దానితో పాటు కలోంజీని కలిపి తీసుకోవడం వల్ల కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్ల మేటరీ ఏజెంట్లు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.
థైరాయిడ్ కలోంజి..
థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ గ్రంథి, ఇది జీవక్రియను నిర్వహించే హార్మోన్లను తయారు చేస్తుంది. ఈ గ్రంథి సరిగ్గా పనిచేయనపుడు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంకు దారితీస్తుంది. ఆహారంలో కలోంజీని తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు.
కొలెస్ట్రాల్
అధిక కొలెస్ట్రాల్ అనేది గుండె పోటు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు మరిన్ని ఆరోగ్యసమస్యల ప్రమాదాన్ని పెంచే సమస్య. కొలెస్ట్రాల్ స్థాయిలను ఆరోగ్యకరమైన ఆహారంతో కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా కలోంజిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కలోంజీని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: పిప్పళ్లను వాడితే ఎన్ని వ్యాధులు తగ్గుతాయంటే.. !
రక్తంలో చక్కెర స్థాయిలు..
బ్లడ్ షుగర్ లెవెల్స్.. అదుపులో ఉండాలంటే కలోంజిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి.
గ్యాస్ట్రిక్ సమస్యలు..
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటే, కొలోంజి విత్తనాలు సహాయపడతాయి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.
1. వీటిని వేయించి, మెత్తగా పొడి చేసి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. రోజుకు 2 గ్రాముల కలోంజి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మేలే.
2. దీనితో మసాలా కూడా తయారు చేసుకోవచ్చు. కలోంజి గింజలు, జీలకర్ర, ధనియాలు, సోంపు కలిపి వేయించి పొడిగా చేసుకోవాలి. వీటిలో పసుపు కలిపి నిల్వచేసుకుని కూరల్లో వాడుకోవచ్చు.
3. కలోంజి గింజల పొడిని కూరలు, గ్రేవీలు, అన్నం, చపాతీలలో కూడా చేర్చుకోవచ్చు. కమ్మని రుచితో కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.