Mental Health : కివీతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అంటే..! ప్రతిరోజూ దీనిని తీసుకుంటే..
ABN , Publish Date - Jan 29 , 2024 | 01:51 PM
కివీని తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి శరీరమంతా చర్మ కణాలు, అవయవాలలో కనిపించే ముఖ్యపదార్థం కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది.
కివీఫ్రూట్ శక్తివంతమైన మూడ్ బూస్టర్‌గా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. నాలుగురోజులు వరుసగా కివీని తీసుకోవడం వల్ల శక్తిని, మానసిక స్థితిని పెంచుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కివీ ఆరోగ్యానికి చేసే మేలు విషయానికి వెళితే..
విటమిన్ సి తీసుకోవడం వల్ల చాలా కాలంగా మెరుగైన మానసిక స్థితి, ఉత్తేజం కలుగుతాయి. బలహీనతతో ఉన్నవారికి కివీ చక్కగా పనిచేస్తుంది. డిప్రెషన్, జ్ఞాపకశక్తిని పెంచే విధంగా మానసిక స్థితిని పెంచుతుంది. తక్కువ విటమిన్ సి స్థాయిలు కలిగిన 155 మంది మీద చేసిన ప్రయోగంలో వీరికి కివీ వరుసగా ఇవ్వడం వల్ల జీవశక్తి, మానసిక స్థితి, నిద్ర నాణ్యతలో మార్పులు కనిపించాయట.. కివీ ఫ్రూట్ సప్లిమెంటేషన్ కేవలం నాలుగు రోజుల్లోవే జీవశక్తి మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
ఇందులోని ఫైబర్ జీర్ణం కాని భాగం ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు సహకరిస్తుంది. కప్పుకు 5 గ్రాములు, కివీస్ ఫైబర్ అద్భుత మూలం. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యం..
కివీని తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి శరీరమంతా చర్మ కణాలు, అవయవాలలో కనిపించే ముఖ్యపదార్థం కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది.
రక్తం గడ్డకట్టడానికి..
రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడంలో రక్తం గడ్డకట్టకుండా, రక్తపోటు నియంత్రణలో ఉంచేందుకు పని చేస్తుంది.
ఇది కూడా చదవండి: స్క్రీన్ సమయం తగ్గించడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు ఎంత ఉంటుందంటే.. !
రోగనిరోధక శక్తి పెంచుతుంది.
కివిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వ్యాధులు కాకుండా, వ్యాధి లక్షణాలను తగ్గించడంలో సహకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆస్తమా సమస్య..
విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఉబ్బసం ఉన్న వారిలో శ్వాసకోశ లక్షణాలను నియంత్రిస్తుంది.
దృష్టి ఆరోగ్యం..
కివీస్ లో ఉండే అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడంట్ విటమిన్లు, కెరోటినాయిడ్స్ కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ల మూలం.
పాలీఫెనాల్స్, ఒక రకమైన యాంటీఆక్సిడెంట్, కివీస్ లో కూడా ఇది పుష్కలంగా ఉంది. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని, ప్రతికూల ప్రభావాలను ఆరోగ్యం మీద చూపుతాయి.. యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ప్రభావాలను తగ్గిస్తుంది.
మంచి నిద్ర..
ఆరోగ్యానికి అవసరమైన మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. బరువును నియంత్రంచడంలో కూడా కివీ పనిచేస్తుంది. కివీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)