Share News

మెగ్నీషియం లోపిస్తే...

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:02 AM

మన శరీరానికి అత్యవసరమైన ఖనిజం మెగ్నీషియం. దీనివల్ల మనకు శక్తి లభిస్తుంది. ఇది శరీరంలోని ఎంజైమ్‌ల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. హార్మోన్స్‌ సమతుల్యాన్ని

మెగ్నీషియం లోపిస్తే...

మన శరీరానికి అత్యవసరమైన ఖనిజం మెగ్నీషియం. దీనివల్ల మనకు శక్తి లభిస్తుంది. ఇది శరీరంలోని ఎంజైమ్‌ల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. హార్మోన్స్‌ సమతుల్యాన్ని కాపాడుతుంది. చక్కని నిద్ర వచ్చేలా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండాలన్నా, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయాలన్నా శరీరానికి మెగ్నీషియం కావాలి.

  • శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఆకలి ఉండదు. వికారంగా ఉంటుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వచ్చి నీరసంగా అనిపిస్తుంది. కంటిచూపు మందగిస్తుంది. కండరాలు పట్టేసినట్లు అనిపిస్తాయి. రక్తపోటు పెరుగుతుంది.

  • మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచే మెగ్నీషియం లభిస్తుంది. అలా లభించనప్పుడు మూత్రపిండాలు తమ వద్ద వున్న మెగ్నీషియంను వినియోగిస్తాయి. కానీ ఇది అంత శ్రేయస్కరం కాదు.

  • తృణధాన్యాలు, పప్పులు, గింజలు, జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, వేరుశనగ, పచ్చి బఠాణీలు, ఖర్జూరాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాయగూరలు, ఆకుకూరలు, అత్తిపండ్లు, అరటి పండ్లు, అవకాడో, క్యాబేజీ, బ్రౌన్‌ రైస్‌, ఓట్స్‌, సీ ఫుడ్‌, మొలకలు వంటివి తరచూ తినడం వలన మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు.

  • శరీరంలో మెగ్నీషియం స్థాయి ఎక్కువైతే డయేరియా, కడుపునొప్పి వంటివి బాధిస్తాయి. ఒక రోజుకి పురుషులకు 400 మిల్లీగ్రాములు, మహిళలకు 300 మిల్లీగ్రాముల మెగ్నీషియం సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:02 AM