Health Tips : మహిళల ఆరోగ్యంలో ముఖ్యంగా పిరియడ్స్ సమస్యల నుంచి రిలీఫ్ ఇచ్చే ఈ మసాలా గురించి తెలుసా..!
ABN , Publish Date - Jun 19 , 2024 | 01:30 PM
ఆహారంలో జాజికాయ చేర్చుకోవడం వల్ల చర్మం నిగారింపుతో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇది అకాల వృద్దాప్యాన్ని తగ్గిస్తుంది. యాంటీ బాక్టీరియల్ గా కూడా పనిచేస్తుంది.
మసాలాలు మన వంటకాల్లో భాగంగా మారిపోయాయి. ఏదైనా ప్రత్యేక సందర్భంలో అలాగే ప్రత్యేక రోజుల్లో వండాలంటే అది మసాలాలు లేని వంటకం అయితే మాత్రం కాదు. జాజికాయ ప్రత్యేకమైన రుచి, వాసనను కలిగి ఉంటుంది. దానిని వంటకంలో వేయగానే దానికి ప్రత్యేకమైన సువాసన వచ్చి చేరుతుంది. ముఖ్యంగా బిర్యానీ, కూరల్లో దీనికి సాటి లేదనే చెప్పాలి. అయితే ఈ జాజికాయకు(Nutmeg)మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని ఉపయోగించుకుని మహిళలు పిరియడ్స్ సమయంలో ఎక్కువగా జరిగే అధిక రక్తస్రావం సమస్యను కూడా తగ్గించవచ్చు అదెలాగంటే..
తీపి, వగరు రుచి కలిగిన జాజీకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్న జాజికాయ పునరుత్పత్తిలో మంచి సపోర్ట్ ఇస్తుంది. పాలతో తీసుకుంటే మూడ్ లిఫ్టర్ గా పనిచేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఆందోళన, నిరాశ వంటి సమస్యలు జాజికాయతో దూరం అవుతాయి.
స్త్రీ ఆరోగ్యానికి.. (women Health Tips)
1. బుుతు నొప్పిని, అసహనాన్ని ఎదుర్కోవాలంటే జాజికాయ సహజమైన నివారణగా పనిచేస్తుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పిరియడ్స్ సమయంలో కలిగే నొప్పిని తగ్గిస్తాయి.
2. హార్మోన్ల సమతుల్యతకు సామర్థ్యం పెంచేందుకు జాజికాయను డైట్లో చేర్చుకోవడం మంచిది.
3. నిద్రను పెంచుతుంది. అలాగే నిద్రలేమి సమస్యను నివారిస్తుంది.
Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!
4. నిద్రను ప్రేరేపిస్తుంది.
5. జీర్ణ ఆరోగ్యాన్ని కూడా జాజికాయ పెంచుతుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం లక్షణాలను తగ్గిస్తుంది.
6. మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. తెలివితేటలను పెంచే విషయంలో ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
7. మానసిక స్థితిని పెంచుతుంది.
Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!
8. అంతేకాదు చర్మానికి మేలు చేస్తుంది. ఆహారంలో జాజికాయ చేర్చుకోవడం వల్ల చర్మం నిగారింపుతో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇది అకాల వృద్దాప్యాన్ని తగ్గిస్తుంది. యాంటీ బాక్టీరియల్ గా కూడా పనిచేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.