Share News

Night Time Habits: గుండెపోటును నివారించాలంటే రాత్రిపూట పాటించాల్సిన అలవాట్లు ఇవే..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:23 PM

తెల్లవారుజామున వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. సాయంత్ర తేలికపాటి వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

Night Time Habits: గుండెపోటును నివారించాలంటే రాత్రిపూట పాటించాల్సిన అలవాట్లు ఇవే..!
Night Time Habits:

రాత్రి సమయంలో కాస్త ఎక్కువగా భోజనం చేయాలని చూస్తాం. డిన్నర్స్, పార్టీలు, ఫంక్షన్లు ఇలా అన్నీ ఫ్లాన్ చేసుకునేది రాత్రి సమయాల్లోనే.. వీటితో రాత్రి భోజనం హెవీ అవుతుంది. చాలా వరకూ అంతా రాత్రి సమయాల్లోనే ఎక్కువగా తినడానికి చూస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. జీవన శైలి అలవాట్ల కారణంగా కూడా అనారోగ్య ఇబ్బందులు పెరుగుతున్నాయి. అదెలాగంటే..

రాత్రి భోజనం హెవీగా తీసుకుంటే దాని ప్రభావం ఆరోగ్యం మీద చాలా బలంగా ఉంటుంది. తేలికపాటి ఆహారంతో తేలికపాటి అలవాట్లతో ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల ప్రమాదం పెరిగింది. దీనికి సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం, చెడు కొలెస్ట్రాల్ వంటివి మొత్తం ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును తెస్తాయి. రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు అది గుండె ధమనుల గోడల్లో అతుక్కుంటుంది. ఇది రక్త ప్రవాహ మార్గాలను అడ్డుకుంటుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతున్నవారు రాత్రిపూట గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక రాత్రి భోజనంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధించడంలో నియంత్రణలో ఉంచాలి.

గుండెపోటు నుంచి సురక్షితం కావడానికి..

రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు అది గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలి.

హెల్తీ డిన్నర్ డైట్..

రాత్రిపూట గుండె ఆరోగ్యం కోసం రాత్రి లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. సాల్మాన్ చేప, అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటి గుండెకు బలాన్నిచ్చే మెరుగైన కొలెస్ట్రాల్ నియంత్రణకు సపోర్ట్ చేసే ఆహారాలను తీసుకోవాలి.

Liver Health : కాలేయంలో వాపు వస్తే కనుక సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!


వ్యాయామం..

తెల్లవారుజామున వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. సాయంత్ర తేలికపాటి వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వీటితో పాటు ఆల్కహాల్, ధూమపానం వంటి అలవాట్లను కూడా దూరంగా ఉంచాలి.

ఒత్తిడిని దూరం..

నిద్రపోయే ముందు లోతైన శ్వాస, లేదా ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రశాంతమైన నిద్ర వల్ల గుండె సమస్యలు, ఒత్తిడి దూరం అవుతాయి.

హైడ్రేటెడ్ గా ఉండండి.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను సరిగా ఉంచేందుకు హైడ్రేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. నీరు త్రాగటం ముఖ్యం. ఇది మంచి రక్త ప్రసరణకు సహకరిస్తుంది. డీహైడ్రేషన్ తో పోరాడుతుంది. టాక్సిన్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది. హైడ్రేషన్ స్థాయిలను సరిగా ఉంచడానికి హెర్బల్ టీలు, పానీయాలు సహకరిస్తాయి.

Asheagandha Health : ఆరోగ్యాన్ని మార్చేసే ఆయుర్వేద మూలికల గురించి తెలుసా .. !

పేగు ఆరోగ్యం..

గుండె జబ్బులు , కొలెస్ట్రాల్ స్థాయిల నియంత్రణ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను సరిగా ఉంచడానికి పేగును ఆరోగ్యంగా ఉంచడం కూడా ముఖ్యమే. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడానికి అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం లేకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి నట్స్, పెరుగు వంటి సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన నిద్ర..

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర చక్రాన్ని పాటించాలి. మంచి నిద్ర అలవాట్లు ఉండాలి. గుండె పనితీరు మెరుగవుతుంది. తక్కువ ఒత్తిడి, గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలు..

కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె ఆరోగ్యంపై కీలకంగా పనిచేస్తాయి. రాత్రిపూట అలవాట్లను, జీవనశైలిలో భాగంగా మంచిగా మార్చుకోవాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 08 , 2024 | 03:24 PM