Share News

Health Tips : ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:05 PM

రక్త కణాల కౌంట్ తక్కువగా ఉంటే మాత్రం డిప్రెషన్, ప్రీమెచ్యూర్ డెలివరీ, ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి రక్తకణాల అభివృద్ధికి సహకరించే పోషకాలు తీసుకోవాలి.

Health Tips : ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..
Red blood cell count

రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టిన తర్వాత చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. ఇలా అకస్మాత్తుగా ఎందుకు అనిపిస్తుందంటే శరీరంలో రక్తకణాల కౌంట్ తక్కువగా ఉండటమే. శరీరంలోని వేరే భాగానికి ఆక్సిజన్ రవాణా చేయడానికి రక్తకణాలు బాధ్యత వహిస్తాయి. అయితే ఈ రక్త కణాల కౌంట్ తక్కువగా ఉంటే మాత్రం డిప్రెషన్, ప్రీమెచ్యూర్ డెలివరీ, ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి రక్తకణాల అభివృద్ధికి సహకరించే పోషకాలు తీసుకోవాలి. అవేమిటంటే..

ఐరన్ రిచ్ ఫుడ్స్..

ఐరన్ లోపం కారణంగా రక్తహీనత అనేది ఏర్పడుతుంది. దీనిని అధిగమించాలంటే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే పోషకాహారం కావాలి. ఇది మాంసం, చిక్కుళ్ళు, గుడ్లు, బీన్స్, ఎండిన పండ్లు ఇవి ఇనుమును పెంచుతాయి.

Liver Health : కాలేయంలో వాపు వస్తే కనుక సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

ఫోలేట్

ఇది ఎముక మజ్జలో ఉంటుంది. ఇది ఎర్రని ఎరుపురంగులో తెల్ల రక్త కణాలను తయారు చేయడానికి అవసరమైన విటమిన్ బి రకం. ఫోలేట్ సప్లిమెంట్ ను ఫోలిక్ యాసిడ్ అంటారు. మన శరీరానికి హిమోగ్లోబిన్ అందించేందుకు ఫోలేట్ ఉపయోగపడుతుంది.

విటమిన్స్..

విటమిన్ బి 12 రక్తకణాల అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తకణాల పెరుగుదలను నిరోధించినట్లయితే దీనిని మెగాలోబ్లాస్టిక్ అనీమియా అని పిలుస్తారు.


రాగి..

రక్త కణాల ఉత్పత్తిలో రాగి నేరుగా సహకరించదు. అయితే ఇది ఇనుమును యాక్సెస్ చేయడానికి కావాలి. రాగిని తక్కువగా తీసుకురావడానికి షెల్పిష్, చెర్రీస్, చేపలు వంటి రాగి అధికంగా ఉండే ఆహారాలు సహకరిస్తాయి.

విటమిన్ సి.

రాగి వలె, విటమిన్ సి కూడా ఎర్రరక్తకణాలు పెరిగేందుకు సహకరించదు. మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విటమిన్ సి అధికంగా లభిస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 08 , 2024 | 04:05 PM