Summer Skin Care : వేసవిలో జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!
ABN , Publish Date - May 01 , 2024 | 04:22 PM
జిడ్డు చర్మం అనేది సహజ నూనె అయిన సెబన్ అధిక ఉత్పత్తి కారణంగా ఉంటుంది. ఈ అదనపు నూనె ముఖం పై మెరిసే నిగారింపును తగ్గించి జిడ్డుగా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా నుదురు, ముక్కు, గడ్డం భాగంలో జిడ్డుతనం కనిపిస్తూ ఉంటుంది.
వేసవిలో వాతావణంలో వేడి కారణంగా ముఖ చర్మం జిడ్డుగా అనిపిస్తుంది. కొందరిలో కాలంతో ప్రమేయం లేకుండానే ముఖం జిడ్డుగా, పేలవంగా అనిపిస్తుంది. చర్మ ఆరోగ్యం కోసం వీళ్లు ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా ముఖం కాంతివంతంగా కనిపించకపోవచ్చు. ముఖ్యంగా చెమట పట్టే కాలంలో అయితే మరీ జిడ్డుగా అనిపిస్తుంది. ఈ జిడ్డు చర్మాన్ని వదిలించుకోవాలంటే ముఖ్యంగా పాటించాల్సిన చిట్కాలను గురించి తెలుసుకుందాం.
జిడ్డుచర్మం అంటే..
జిడ్డు చర్మం అనేది సహజ నూనె అయిన సెబన్ అధిక ఉత్పత్తి కారణంగా ఉంటుంది. ఈ అదనపు నూనె ముఖం పై మెరిసే నిగారింపును తగ్గించి జిడ్డుగా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా నుదురు, ముక్కు, గడ్డం భాగంలో జిడ్డుతనం కనిపిస్తూ ఉంటుంది.
చిట్కాలు ఇవి పాటించి చూడండి..
1. తేలికపాటి క్లెన్లర్ తో ముఖాన్ని కడుగుతూ ఉండండి.. ఆపైన మెత్తని టవెల్ తో తుడిస్తే సరి.
2. 30 నిమిషాల పాటు చర్మాన్ని ఏదైనా క్రీమ్ తో మర్దనా చేస్తూ ఉన్నా సరిపోతుంది.
Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!
3. బ్లాటింగ్ పేపర్ ఉపయోగించి ముఖంపై నొక్కి ఉంచండి. ఇది నూనెతో జిడ్డుగా ఉన్న చర్మాన్ని పొడిగా మార్చుతుంది.
4. మెటిమల సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది తగ్గాలంటే మేకప్ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి.
Energy Levels : శక్తిలేనట్టుగా, అలసటగా ఉంటే తిరిగి శక్తిని పొందేందుకు ఇలా చేయండి..!
5. ఐ షాడో, ఫౌండేషన్ ఉపయోగిస్తున్నా కూడా చెమట కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది.
6. చికాకు, సున్నితత్వం జిడ్డు చర్మంతో ఉంటుంది. సెబోర్హెయిక్ డెర్మటైటిస్ వంటి వాపుకు కూడా కారణం కావచ్చు. దీని నుంచి తప్పించుకోవాలంటే వైద్య సహాయం తప్పని సరి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.