Share News

Period Symptoms : స్త్రీలు నిర్లక్ష్యం చేయకూడని 7 పీరియడ్ లక్షణాలు ..

ABN , Publish Date - May 31 , 2024 | 04:43 PM

అతిగా రక్తస్రావం కావడం వల్ల గర్బాశయ ఫైబ్రాయిడ్స్ వంటి వివిధ ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయనే సంకేతం. గర్భాళయంపై, క్యాన్సర్ పెరుగుదల కానీ, పెల్విక్ నొప్పి, తరచుగా మూత్రవిసర్జనలో కలిగే సమస్యలను కలిగిస్తాయి.

Period Symptoms : స్త్రీలు నిర్లక్ష్యం చేయకూడని 7 పీరియడ్ లక్షణాలు ..
Period Symptoms

ఆడవారికి ప్రతి నెల నెలసరి ఇబ్బంది తప్పదు. వయసుకు వచ్చింది మొదలుకుని, మోనోపాజ్ స్థితి వరకూ పిరియడ్స్ దానితో వచ్చే ఇబ్బందులు తప్పనిసరి. కడుపు నొప్పి, మగత, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ప్రతి ఒక్కరిలోనూ సర్వసాధారణమైన సమస్యలే. అయితే బుతుక్రమం సమయంలో ఇటువంటి సమస్యలు మరింత తీవ్రం అయితే కనుక నిర్లష్యం చేయకపోవడం మంచిది.

పిరియడ్స్ ఏడురోజుల్లో ఇటువంటి సమస్య ఉంటే..

పిరియడ్స్ సమయంలో గంట వ్యవధిలోనే ప్యాడ్ మార్చుకుంటూ ఉండటం, కడుపునొప్పి విపరీతంగా ఉండటం, ఇవన్నీ కూడా రెగ్యులర్ పిరియడ్స్ కంటే ఇబ్బందిని కలిగిస్తుంటే కనుక వైద్యసహాయం పొందటం మంచిది. ఇవి మెనోరాగియాగా నిర్ధారించవచ్చు. ఒక గంట సమయంలోనే ప్యాడ్ మార్చే పరిస్థితి, అలాగే రక్తస్రావం వారం అంతా కావడం కూడా పిరియడ్ సమస్య మెనోరాగియా కిందకు వస్తుంది.

రక్తస్రావం ఎక్కువ సేపు ఉండటం అనేది చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీనినే CDCఅనే సమస్యగా చెబుతారు. రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లయితే కణాలాలకు ఆక్సిజన్ పొందడానికి ఎర్రరక్త కణాలు ఉండవు. దీనితో అలసట, బలహీనంగా ఉండటం ఉంటుంది.

ఇదే పరిస్థితి కొనసాగి రక్త నష్టం ఎక్కువగా ఉంటుంది, తిమ్మిరి, మెనోరాగియా ఉన్నట్లయితే అలిసిపోయి, శక్తి తక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితిలో డాక్టర్ ని సాంప్రదించాలి.


Expensive Foods : భారతదేశంలో లభించే 5 అత్యంత ఖరీదైన ఆహారాలు..

అతిగా రక్తస్రావం కావడం వల్ల గర్బాశయ ఫైబ్రాయిడ్స్ వంటి వివిధ ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయనే సంకేతం. గర్భాళయంపై, క్యాన్సర్ పెరుగుదల కానీ, పెల్విక్ నొప్పి, తరచుగా మూత్రవిసర్జనలో కలిగే సమస్యలను కలిగిస్తాయి. గర్భాశయ పాలిప్స్, గర్భాశయంలోని లోపలి పొరపై ఏర్పడే పెరుగుదల తీవ్రమైన రక్తస్రావానికి కూడా కారణం కావచ్చు. గర్భాశయ పాలిప్స్, గడ్డలు, క్యాన్స్ వంటి సమస్యలు ఉండవచ్చు.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. ఇది భారీ రక్తస్రావానికి కారణం కావచ్చు. ఆండ్రోజెన్ హార్మోన్ల అధిక స్థాయిలకు కూడా కారణం అవుతుంది.

ఇంత ఇబ్బందిరకమైన బుుతు రక్తస్రావం అనేది రోగనిరోధక థ్రోంబోసైటోపెనియా వంటి చాలా రక్తాన్ని కోల్పోయేలా చేసే రుగ్మతలలో ఒకటి. వైద్యుల సలహాతో, బలమైన ఆహారం ద్వారా, మంచి జీవన శైలి అలవాట్లతోనూ ఈ సమస్యను అధిగమించవద్దు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 31 , 2024 | 04:46 PM