Hair Loss: జుట్టు రాలడానికి కారణాలేంటి? ఈ టిప్స్ పాటిస్తే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు!
ABN , Publish Date - Jan 07 , 2024 | 01:31 PM
పూర్వ కాలంలో వయసు ముదిరిన వారు మాత్రమే జట్టు రాలే సమస్యను ఎదుర్కొనేవారు. ప్రస్తుత కాలంలో యువత కూడా జట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం, విపరీతమైన ఒత్తిడి, తీసుకుంటున్న ఆహారం వంటివి జుట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
పూర్వ కాలంలో వయసు ముదిరిన వారు మాత్రమే జట్టు రాలే (Hair Loss) సమస్యను ఎదుర్కొనేవారు. ప్రస్తుత కాలంలో యువత కూడా జట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం, విపరీతమైన ఒత్తిడి (Stress), తీసుకుంటున్న ఆహారం వంటివి జుట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే రసయనాలతో కూడిన షాంపూలు కూడా జట్టు రాలడానికి కారణమవుతున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం మూడింట రెండు వంతుల మంది మూడు పదుల వయసులోనే ఈ సమస్య ఎదుర్కొంటున్నారు (Hair Fall).
కారణాలు:
1)రోజు రోజుకు పెరిగిపోతున్న ఎమోషనల్ స్ట్రెస్ జట్టు రాలడానికి కారణమవుతోంది. ఒత్తడి వల్ల విడుదలయ్యే కొన్ని హార్మోన్లు జుట్టు పలచబడడానికి కారణమవుతాయి.
2)జుట్టు రాలడంలో ప్రొటీన్ లోపం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రోటీన్లు లేని ఆహారం తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుంది.
3)ఇక బరువు తగ్గేందుకు చేసే రకరకాల డైట్‌ల వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది.
4)వయసు ప్రభావం, వారసత్వంగా వచ్చే జన్యువుల కారణంగా కూడా జట్టు రాలిపోవడం కామన్
5)రోజు వారి జీవితంలో వాడే సబ్బులు, షాంపూలు కూడా జట్టును బలహీనపరుస్తున్నాయి.
ఇలా చేయండి..
1)ఆరోగ్యకర, ప్రోటీన్లతో నిండిన ఆహారాన్ని తీసుకోండి.
2)ఒత్తడి తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేయండి. శారీరకంగా యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.
3)మసాజ్, ధ్యానం వంటి రిలాక్సేషన్ పద్ధతులను పాటించండి.
4)మీ జట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి దానికి తగిన చికిత్స పొందండి.