The Skin : బాడీ వాష్, షవర్ జెల్ చర్మానికి ఏది బెస్ట్..!
ABN , Publish Date - May 17 , 2024 | 03:20 PM
బాదం, కుంకుమ పువ్వు స్వచ్చమైన ఆవు నెయ్యి. ఇలా చాలా ఆయుర్వేద మూలికలతో సహా స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేసిన సహజమైన సబ్బులు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
స్నానం వల్ల శరీరం శుభ్రంగా తయారవుతుంది. శరీరం మీద మురికి పోయేందుకు ఈ నురుగు వంటి ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. చర్మ ఆరోగ్యం ఎప్పుడూ అవసరమే. ఏ కాలంలో ఏది అవసరమో అదేవిధంగా చర్మాన్ని కాపాడుకుంటూ రావాలి. ఇలాంటి చిట్కాలతో చర్మం నిగారింపుగా కనిపిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధంగా బాడీ వాష్, షవర్ జెల్ Shower Gelఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయో, ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
బాడీ వాష్ Body Washఅనేది శరీరంపై ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చాలా బాడీ వాష్‌లలో నూనె, షియా బటర్, విటమిన్లు వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మృదువుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. షవర్ జెల్ అనేది సబ్బు ద్రవం. ఇది సాధారణంగా నీరు ఎమల్సిఫైయర్లు, సువాసనలు కలిపి చేసే ఉత్పత్తులు. షవర్ జెల్ వంటివి బాగా నురుగు తెస్తాయి.
షవర్ జెల్ కంటే బాడీ షవర్ జెల్ మంచిదా..
1. షవర్ జెల్ Shower Gel & బాడీ వాష్ Body Wash ఏది ఉత్తమమైనది. బాడీవాష్, షవర్ జెల్ తో పోలిస్తే చర్మానికి లోతైన మాయిశ్చరైజేషన్ను అందిస్తుంది.
2. హ్యాండ్ మేడ్ సోపులు, క్లెన్సర్లు ఇలా చాలా చర్మం నిగారింపుకు పనిచేస్తాయని వాడేస్తూ ఉంటాం.
3. బాదం, కుంకుమ పువ్వు స్వచ్చమైన ఆవు నెయ్యి. ఇలా చాలా ఆయుర్వేద మూలికలతో సహా స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేసిన సహజమైన సబ్బులు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
4. 100 శాతం బార్ సోప్స్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. సున్నితమైన సువాసనను అందిస్తాయి.
5. షవర్ జెల్ మగవారికి బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి మహిళలకూ బాగా ఉపయోగపడతాయి.
Munaga Leaf : రోగనిరోధక శక్తి నుంచి చర్మ ఆరోగ్యం వరకూ.. మునగ ఆకుతో ఎన్ని ప్రయోజనాలో..!
6. బాడీ షవర్ జెల్స్ నురుగు పుష్కలంగా వస్తాయి. కానీ బాడీ వాష్ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉన్నా, బాడీ షవర్ జిడ్డు, మొటిమలు గల చర్మానికి సరిపోతాయి.
7. ఏ వాతావరణంలో వచ్చే మార్పులలోనైనా పొడిచర్మం, సున్నితమైన చర్మానికి ఇలా చర్మాన్ని పోషించడంలో బాడీ షవర్ జెల్స్ నుంచి మాయిశ్చరైజింగ్ బాడీ వాష్ లకు మారడం మంచిది.
Clay Pot Cooking: మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!
8. సున్నితమైన షవర్ వాష్‌లు సల్ఫేట్ రహితంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సిల్కీగా, మృదువుగా ఉంచుతాయి.
9. అలోవేరా, కొబ్బరి ఫ్లోవర్స్‌లో 100 శాతం సల్ఫేట్ ఉంటుంది. ఇది చర్మానికి సరిపోతేనే ఉపయోగించాలి.
10. మన చర్మ తత్వాన్ని బట్టి ఏది ఉపయోగిస్తే నిగారింపు పెరుగుతుందో, పొడిచర్మం దూరమవుతుందో దానినే ఉపయోగించాలి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.