Share News

Sugarcane juice : చెరుకు రసాన్ని రెండు నిమిషాల్లో ఇంట్లోనే ఎలా చేయచ్చో తెలుసా..!

ABN , Publish Date - May 03 , 2024 | 04:16 PM

ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ తో సహా ఖనిజాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే కేలరీలు, కార్బోహైడ్రేట్స్ తో కలిపి ఉండే ఈ జ్యూస్ వేసవిలో మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. వేసవి వేడికి చల్లదనాన్ని ఇస్తుంది.

Sugarcane juice : చెరుకు రసాన్ని రెండు నిమిషాల్లో ఇంట్లోనే ఎలా చేయచ్చో తెలుసా..!
Sugarcane juice

వేసవి వచ్చిందంటే పానీయాలకు మంచి గిరాకీ.. పండ్ల రసాల దగ్గర నుంచి కొబ్బరి బొండం, చెరుకు రసం ఇలా చాలా షాపులు కనిపిస్తూనే ఉంటాయి. అయితే కొబ్బరి నీళ్లనైనా మనం కష్టపడి ఇంట్లో తీసుకోగలుగుతాం కానీ..చెరుకు రసాన్ని తీయడం మన వల్ల అయ్యే పనికాదు. దీనిని ప్రత్యేకమైన యంత్రంలో పెట్టి మాత్రమే రసాన్ని తీసుకోగలుగుతాం. అయితే ఇంట్లో చెరుకురసాన్ని ఎలాంటి యంత్రాలూ లేకుండానే ఎలా తీయాలో చూద్దాం.

చెరుకులో చాలా పోషకాలున్నాయి. ముఖ్యంగా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ తో సహా ఖనిజాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే కేలరీలు, కార్బోహైడ్రేట్స్ తో కలిపి ఉండే ఈ జ్యూస్ వేసవిలో మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. వేసవి వేడికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ చెరకు రసాన్ని చెరకు ముక్కలతోనే కాకుండా ఇలా కూడా చేయవచ్చు..

Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!

అందుకు..

నాలుగు టీస్పూన్ల బెల్లం పొడి

పుదీనా ఆకులు

నిమ్మకాయ రసం

ఐస్

బ్లాక్ ఉప్పు..


తయారుచేసే పద్దతి

మిక్సీలో అన్నీ వేసి తగినంత నీటిని వేసి తిప్పాలి. ఇది మంచి రుచితో అచ్చం చెరుకు రసాన్ని తాగుతున్నట్లుగానే ఉంటుంది.

ఈ జ్యూస్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరెన్ సతో ఖనిజాలు కూడా పుష్కంలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికంటే, బరువు పెరగాలనుకునేవారికి ఇది మంచి శక్తిని ఇస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. చక్కెరకు బదులుగా దీనిని తీసుకోవచ్చు.

Summer Skin Care : వేసవిలో జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!

సమతుల్య ఆహారంలో భాగంగా చెరకు రసం, బెల్లం రెండింటినీ మితంగా నే తీసుకోవడం మంచిది. ఇంట్లో బెల్లంతో చేసే ఈ జ్యూస్ సువాసనతో రిఫ్రెష్ పానీయంగా ఉంటుంది. తాజా చెరుకు రసంతో ఉండే పోషకాలు ఇందులో అన్నీ ఉండకపోయినా వేసవి వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది. మంచి తీపితో బెల్లం నీరులా కాకుండా చెరుకు రసం తాగుతున్న ఫీలింగ్ నే ఇస్తుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 03 , 2024 | 04:16 PM