Mango seeds : మామిడి కాయలు తిని టెంకలు పారేస్తున్నారా? వీటితో ఎన్ని లాభాలో తెలుసా..!
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:47 PM
ఈ మామిడి టెంక వ్యర్థ పదార్థం అయితే మాత్రం కాదు. దీనితోనూ చాలా ఉపయోగాలున్నాయి. కొన్ని ప్రదేశాల్లో కరువు బాగా ఉన్న చోట్ల మామిడి జీడితో జావలాంటిది తయారుచేసుకుని తాగుతారు. దీనిలో చాలా పోషకాలున్నాయి.
వేసవి అంటేనే మామిడి కాలం. మామిడి పండ్లను తినడం అంటే చాలా మందికి నచ్చిన విషయం. పిల్లలు పెద్దలూ అంతా కూడా మామిడి పండ్లను తినేందుకు ఇష్టపడతారు. అయితే మామిడి పండ్లను తినడం వేసవి సంబరాల్లో ముఖ్యమైనది. మామిడి కాయ తిన్నాకా ఆ టెంకలను పారేస్తాం. అవి ఎక్కడో ఒకచోట మొలకెత్తి మొక్కలు వస్తాయి. అయితే ఈ మామిడి టెంక వ్యర్థ పదార్థం అయితే మాత్రం కాదు. దీనితోనూ చాలా ఉపయోగాలున్నాయి. కొన్ని ప్రదేశాల్లో కరువు బాగా ఉన్న చోట్ల మామిడి జీడితో జావలాంటిది తయారుచేసుకుని తాగుతారు. దీనిలో చాలా పోషకాలున్నాయి. ఇంకా వీటితో ఏం లాభాలంటే..
మామిడి టెంకల్లో ఏముంది..
యాంటీ ఆక్సిడెంట్లు.. మామిడి టెంకల్లో ఫినోలిక్ సమ్మేళనాలున్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహకరిస్తుంది. మెరిసే చర్మాన్ని ఇస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది...
మామిడి టెంకల్లో విటమిన్ సి ఉంటుంది. ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థను దీనితో పొందవచ్చు. మామిడి గింజలను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.
Curry With Aloe Vera : అలోవెరాతో కూర చేస్తారా? ఈ ప్రత్యేకమైన వంటకాన్ని గురించి తెలుసుకోండి..!!
జీవక్రియకు..
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ అవసరం. మామిడి గింజలు డైటరీ ఫైబర్ మంచి మూలం. వాటిని తీసుకోవడం వల్ల సాధారణ పేగు కదలికలను పెంచుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు..
మామిడి గింజలలో ఉండే సమ్మేళనాలు, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడానికి కూడా..
క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ మామిడి గింజలను చేర్చడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీవక్రియ మెరుగవుతుంది. దీనితో అప్రయత్నంగానే బరువు తగ్గుతారు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.