Share News

Parrot Fever: ఈ పిట్టకోసిస్ వ్యాధికి చిలకలే కారణమా..? దీని లక్షణాలు ఏమిటంటే..!

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:33 PM

పక్షులను లేదా వాటి పంజరాలను ముట్టుకున్న తర్వాత చేతులను బాగా కడగడం, పక్షులను పట్టుకునేప్పుడు ముఖాన్ని తాకకుండా ఉండటం, పక్షి బోనులను శుభ్రపరిచేటప్పుడు లేదా జబ్బుపడిన పక్షులను పట్టుకునేప్పుడు చేతి తొడుగులు, ముసుగు ధరించడం వంటివి

Parrot Fever: ఈ పిట్టకోసిస్ వ్యాధికి చిలకలే కారణమా..? దీని లక్షణాలు ఏమిటంటే..!
Parrot Fever

పక్షులు ప్రకృతి భాగం. అందమైన రూపాలతో, రకరకాల అరుపులతో పక్షులు చేసే సందడి అందరికీ నచ్చుతుంది. పక్షుల్ని ప్రేమించి, పెంచుకునే ఔత్సాహికులు, పక్షి ప్రేమికులు కూడా ఎక్కువే. అయితే ఈ మధ్య కాలంలో పక్షులు ముఖ్యంగా రామ చిలుకలతో వచ్చే ఓ వ్యాధి ఐరోపా దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. ఐరోపాలో 'చిలుక జ్వరం' వ్యాధితో ఐదుగురు మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన ప్రకటనలో పెంపుడు జంతువుల యజమానులు, పక్షుల ఔత్సాహికులలో విస్తృతమైన ఆందోళన, భయాందోళనలకు కారణమైంది. అయితే చిలుక జ్వరం అంటే ఏమిటి.. దానిని ఎలా నివారించవచ్చు? ఈ ప్రాణాంతక వ్యాధికి గల కారణాలు, లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

చిలుక జ్వరం psittaci అంటే ఏమిటి?

చిలుక జ్వరం, దీనిని పిట్టకోసిస్ లేదా క్లామిడియా పిట్టాసి ఇన్‌ఫెక్షన్ అని కూడా పిలుస్తారు, చిలుక జ్వరం అనేది క్లామిడియా సిట్టాసి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్. ఇది ప్రధానంగా చిలుకలు, కాకాటియల్స్, పావురాలతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అలాగే మానవులకు కూడా వ్యాపిస్తుంది. దీనిని బాక్టీరియా వ్యాధి సోకిన పక్షుల రెట్టలు, స్రావాలలో కనుగొనవచ్చు. కలుషితమైన ధూళి కణాలను ప్రత్యక్షంగా, లేదా పీల్చడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

చిలుక జ్వరం ప్రభావితం ఎలా ఉంటుంది.

ఈ బ్యాక్టీరియా సోకినప్పుడు, జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి ఫ్లూ లాంటి లక్షణాలు పెరుగుతాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఇది న్యుమోనియా, శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుంది.

ఈ వ్యాధికి కారణాలు ఏమిటి?

ఈ బ్యాక్టీరియా ప్రధానంగా పక్షులలో కనిపిస్తుంది. ఇది సోకిన పక్షులు లేదా వాటి రెట్టలు, ఈకలు లేదా శ్వాసకోశ స్రావాల ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. పక్షుల పెంపకందారులు, పెంపుడు జంతువుల దుకాణ ఉద్యోగులు, పశువైద్యులు వంటి పక్షులతో పనిచేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వ్యక్తులు చిలుక జ్వరానికి ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

దంతాలను సహజంగా తెల్లగా చేసుకోవడం ఎలా..!

జుట్టు పెరగాలంటే ఈ సమస్యలు దాటేస్తే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!

శివరాత్రి రోజున శివుడ్ని ఎలా అభిషేకించి తరించాలి.. !


చిలుక జ్వరం లక్షణాలు ఏమిటి?

జ్వరం, చలి

తలనొప్పి

మైయాల్జియా

అప్పుడప్పుడు దద్దుర్లు

కండరాల నొప్పులు

పొడి దగ్గు

వికారం, వాంతులు

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం

న్యుమోనియా (తీవ్రమైన సందర్భాలలో)

చిలుక జ్వరాన్ని మనం ఎలా నివారించవచ్చు?

చిలుక జ్వరాన్ని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం పక్షులను ముట్టుకున్నప్పుడు లేదా పక్షులు ఉన్న ప్రదేశాలలో పనిచేసేటప్పుడు మంచి పరిశుభ్రతను పాటించడం. పక్షులను లేదా వాటి పంజరాలను ముట్టుకున్న తర్వాత చేతులను బాగా కడగడం, పక్షులను పట్టుకునేప్పుడు ముఖాన్ని తాకకుండా ఉండటం, పక్షి బోనులను శుభ్రపరిచేటప్పుడు లేదా జబ్బుపడిన పక్షులను పట్టుకునేప్పుడు చేతి తొడుగులు, ముసుగు ధరించడం వంటివి ఇందులో ముఖ్యమైన పనులు.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 09 , 2024 | 03:37 PM