Fish: ఈ సీజన్లో చేప తింటే.. కంటిచూపును మెరుగు పరచడమే కాదు.. చర్మ సమస్యలూ తగ్గిస్తుందా..?
ABN , Publish Date - Jan 16 , 2024 | 01:11 PM
చేపలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందుతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కంటి చూపును మెరుగు పరుస్తుంది.
చలికాలంలో చాలామంది వేడిగా భోజనం చేయాలనుకుంటారు. వేడి అన్నం మీద వేడి వేడి కూర వేసుకుని తింటే కాస్త హాయిగా అనిపించడమే కాదు..ఇలా వేడి వేడిగా తినడం వల్ల చాలా వరకూ అన్నం త్వరగా జీర్ణం కావడం జరుగుతుంది. ఇక ఈ సీజన్లో వ్యాధులకు చెక్ పెట్టాలంటే.. పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. దీనికోసం ఆహారంలో చేపలను తీసుకుంటే శీతాకాలంలో ఫిట్ నెస్ లోపం ఉన్న వారిలో పోషకాలను భర్తీ చేస్తుంది.
చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
చేపలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందుతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే ట్యూనా ఫిష్ తీసుకోవడం వల్ల సాల్మన్, మాకేరెల్ వంటి చేపలను తీసుకోవడం ముఖ్యంగా శీతాకాలంలో అవసరం.
1. ఈ కాలంలో చర్మం పొడిబారడం, చర్మంలోని మెరుపు తగ్గడం వంటివి కనిపిస్తూ ఉంటాయి.
2. ఈ సమస్యలను చేపలలోని ఒమేగా 3, ఒమేగా 6 చర్మ రంగును తిరిగి ఇస్తాయి.
ఇది కూడా చదవండి: పచ్చి శనగలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా... వీటిని తీసుకుంటే ఎముక ఆరోగ్యానికి ఢోకాలేదు ..!
3. అంతే కాకుండా ఇందులోని విటమిన్లు, మినరల్స్ తో పాటు విటమిన్ 12, ఒమేగా. 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
4. చలికాలంలో తరచుగా దగ్గు, జలుబుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి.
5. ఇది ఈ శ్వాస సంబంధిత సమస్యలను ప్రభావాన్ని చూపుతుంది.
6. ఈ సమయంలో చేపలను తీసుకోవడం వల్ల ఒమేగా -3 శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
7. ఇలాంటి పోషకాలున్న సాల్మన్ ఫిష్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతుంది.
8. ఒమేగా-3 అధిక కొలెస్ట్రాల్‌పై ప్రభావాన్ని చూపుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
9. చేపల్ని తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
10. ఇవి శరీరంలో ఏర్పడే వాపుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)