Share News

Butterfly Pea Flower : మన పెరిటి మొక్కే.. ఈ నీలం రంగులో ఎన్నో ప్రయోజనాలో..

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:16 PM

ఫుడ్ కలరింగ్ కోసం సీతాకోకచిలుక బఠానీ పువ్వులను ఉపయోగిస్తారు. కాబట్టి, దీన్ని అన్నం లేదా నూడుల్స్‌లో వేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదే.

Butterfly Pea Flower : మన పెరిటి మొక్కే.. ఈ నీలం రంగులో ఎన్నో ప్రయోజనాలో..
Butterfly Pea Flower

శంఖం పూలను సీతాకోక చిలుక పువ్వులని కూడా పిలుస్తారు. ఇవి ఆగ్నేయాసియాకు చెందిన మొక్క. ఇందులోని యంటీ ఆక్సిండెంట్లు చర్మం, జుట్టుకు ఉపయోగపడతాయి. దీనితో బరువు తగ్గడం, రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడం వంటి ఉపయోగాలున్నాయి.శంఖం పువ్వు గురించి వినే ఉంటారుగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్ళల్లో తెగపెంచుతున్నారు. ఈ మొక్కలోని పోషకాల గురించి తెలిసాకా.. ఇంకా ఎక్కువైంది ఈ మొక్క పెంపకం. ఆగ్నేయాసియాలోని ఆయుర్వేద వైద్యంలో ప్రధానమైనది. అయితే శంఖం పూలను గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

1. శంఖం పూలలో శక్తివంతమైన నీలం రంగు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

2. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటెంట్ కారణంగా చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహకరిస్తుంది.

3. యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గేందుకు కూడా మద్దతు ఇస్తాయి.

4. దీనితో టీ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పోషకాలను అందిస్తుంది.

5. రంగు మార్చే లక్షణాలు..ఇది అనేక PH స్థాయిలను కలిసినప్పుడు పూల రంగు మారుతుంది.

ఇది కూడా చదవండి: పోషకాల గని కోహ్లాబీ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా...!

సాంప్రదాయ ఉపయోగాలు

1. బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ తయారు చేయడం

సీతాకోకచిలుక పువ్వుల 1 టీస్పూన్ (4 గ్రాములు) తీసుకోండి.

240 mL వేడి నీటిలో పువ్వులను వేయండి.

టీని 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి.

ఎండిన పువ్వులను వడకట్టాలి. టీని వేడిగా ఆస్వాదించండి.

2. రుచి

ఈ రుచిని మెరుగుపరచడానికి తేనె, నిమ్మరసం లేదా పుదీనా ఆకులను ప్రయత్నించండి. నిమ్మరసం పానీయాన్ని నీలం నుండి ఊదా రంగులోకి మారుస్తుంది.

3. బటర్‌ఫ్లై పీ ఫ్లవర్‌తో వంట

దీన్ని వంటకాల్లో ఉపయోగించవచ్చు.


మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..

4. బియ్యం, నూడిల్ వంటకాలు

ఫుడ్ కలరింగ్ కోసం సీతాకోకచిలుక బఠానీ పువ్వులను ఉపయోగిస్తారు. కాబట్టి, దీన్ని అన్నం లేదా నూడుల్స్‌లో వేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదే.

5. డెజర్ట్‌లు, పానీయాలు

డెజర్ట్‌లు,పానీయాలు దాని రంగును మారి కొత్తగా కనిపిస్తాయి.

6. పోషకాల మూలం..

ఈ పూలలో యాంటీఆక్సింట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని టెర్నాటిన్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కెంప్పెరోల్, పి - కౌమారిక్ యాడిస్, డెల్ఫినిడిన్ -3, 5 - గ్లూకోసైడ్ కూడా ఉన్నాయి.

7. సహజ ఆహార రంగు

ఈ పువ్వులను సహజ ఆహార రంగుగా కూడా ఉపయోగించవచ్చు. ఇది బట్టలకు కూడా ప్రకృతి సిద్ధమైన రంగుగా వాడవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Feb 26 , 2024 | 12:16 PM