Share News

vegetarians : ప్రపంచంలో శాఖాహారాన్ని తీసుకునే దేశాలు, వాటి స్థానాలు ఏంటంటే..!

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:54 PM

అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 బిలియన్ల మంది ప్రజలు మాంసం తినరు, ప్రపంచ జనాభాలో 18 శాతం మంది శాఖాహారులు ఉన్నారు. ప్రపంచంలోని మంచినీటిలో దాదాపు ఐదవ వంతు పశువుల పెంపకంలో ఉపయోగించబడుతుందని కూడా అంచనా వేయబడింది.

vegetarians : ప్రపంచంలో శాఖాహారాన్ని తీసుకునే దేశాలు, వాటి స్థానాలు ఏంటంటే..!
vegetarianism

జీవ హింస చేయడం ఇష్టలేకపోవడం, మాంసాహారాలు తినలేకపోవడం, అనారోగ్య కారణాలు,. మత ధర్మాల కారణంగా ప్రజలు శాకాహారులుగా (vegetarianism) ఉండటానికి లేదా మారడానికి అవకాశాలు ఉన్నాయి. కొందరు మాంసాహారం అధికంగా తీసుకుంటున్నామనే ఆందోళనల కారణంగా శాఖాహారంగా ఎంచుకుంటారు, మరికొందరు ఆరోగ్య కారణాలు, లక్ష్యాల కోసం దీన్ని ఫాలో అవుతారు. కొందరు అవసరానికి మించి శాఖాహారులు కావచ్చు. శాకాహారిగా (vegetarianism) ఉండటం వెనుక కారణం ఏమైనప్పటికీ ఇలా మారడం వల్ల ఆరోగ్యంతో పాటు, ఎందరికో ఆదర్శంగా కూడా నిలుస్తారు. ప్రపంచ దేశాలు శాఖాహారం వైపుకు మారుతున్నాయి. వ్యవసాయ మూలాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎందుకంటే సారవంతమైన భూమి కారణంగా మొక్కల ఆధారిత ఆహారాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రధానంగా శాఖాహారం తీసుకోవడం వల్ల ఆహారంలో వివిధ ధాన్యాలు, చిక్కుళ్ళు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఇలా తీసుకోవడం వల్ల వ్యవసాయం పెరుగుతుంది. అలాగే జీవ హింస తగ్గుతుంది.

శాఖాహారులుగా (vegetarianism) మారిన దేశాల్లో ముఖ్యంగా మెక్సికో, బ్రెజిల్ వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి, వారి దేశాలలో అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారు. రెండు దేశాలు ఇటీవల శాఖాహారం,శాకాహారి మాంసం ప్రత్యామ్నాయాల ఉత్పత్తిని పెంచాయి. అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 బిలియన్ల మంది ప్రజలు మాంసం తినరు, ప్రపంచ జనాభాలో 18 శాతం మంది శాఖాహారులు ఉన్నారు. ప్రపంచంలోని మంచినీటిలో దాదాపు ఐదవ వంతు పశువుల పెంపకంలో ఉపయోగించబడుతుందని కూడా అంచనా వేయబడింది. వ్యవసాయ యోగ్యమైన భూమిలో మూడింట ఒక వంతు పశువుల దాణాను పండించడానికి ఉపయోగించబడుతుంది. ఇది శాఖాహారాన్ని మరింత స్థిరమైన ఆహార ఎంపికగా చేస్తుంది. ఈ అంచనాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 10 దేశాలు శాఖాహారులుగా ఉన్నాయి. అందులో ఎంత ఏదేశం అగ్రస్థానంలో ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

అత్యధిక సంఖ్యలో శాఖాహారులున్న టాప్ 10 దేశాలు ఇవే..

అత్యధిక శాఖారులు సంఖ్య ఉన్న దేశాల్లో ఐర్లాండ్ 10వ స్థానంలో ఉంది. జనాభాలో 6% మంది శాఖాహార జీవనశైలిని అనుసరిస్తున్నారు.

ప్రపంచంలో అట్లాస్ ప్రకారం బ్రెజిల్ జనాభాలో 8% మంది శాఖాహారాన్ని తీసుకుంటున్నారు ఇది దేశంలోనే 9వ స్థానంలో ఉంది.

Brain health : మెదడును ఆరోగ్యంగా ఉంచే 10 సూపర్ ఫుడ్స్ ఇవే.. !

యునైటెడ్ కింగ్ డమ్ శాఖాహారుల జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఇందులో 6% జనాభా ఉన్నారు.

జర్మనీ 7వ స్థానంలో ఉంది. ఇక్కడ శాఖాహారులు 9% ఉన్నారు.

ఆస్ట్రియా 6వ స్థానంలో ఉంది. జనాభాలో 9%మంది శాఖాహారులున్నారు.

ఇటలీ 5వ స్థానంలో ఉంది. జనాబాలో 10% మంది శాఖాహారానికి మారారు.

ఆస్ట్రేలియా లెక్కల ప్రకారం జనాభాలో 12% శాకాహారులు కావడంతో ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉంది.


Dry shampoos : డ్రై షాంపూని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసా..!

ప్రపంచంలోనే అట్లాస్ ప్రకారం, జనాభాలో 12% జనాభా భౌద్ధ శాఖాహార పద్దతులను అనుసరిస్తున్నారు. తైవాన్ 3వ స్థానాన్ని ఆక్రమించారు.

ఇజ్రాయెల్.. ప్రపంచ అట్లాస్ ప్రకారం ఇజ్రాయెల్ 2వ దేశం. దాని జనాభాలో 13% మంది శాఖాహార జీవన శైలికి కట్టబడి ఉన్నారు.

భారతదేశం.. తాజా సర్వే ప్రకారం భారతదేశం శాఖాహాల విషయంలో అగ్రస్థానంలో ఉంది. జనాభాలో 25% మంది శాఖాహారులుగా గుర్తించబడ్డారు.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 19 , 2024 | 01:54 PM