Bottle Courd : ఈ వేసవిలో పొట్లకాయ తినడం వల్ల 5 ప్రయోజనాలు ఇవే..!
ABN , Publish Date - Jun 20 , 2024 | 01:42 PM
సొరకాయలో విటమిన్ బి, సి, ఎ, కె, ఈ, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. దీనిని కూరగానే కాకుండా జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. ఇది రోజంతా శక్తితో ఉండేలా చేస్తుంది.
వేసవిలో ఎండలు మండిపోతున్న సమయం ఇలాంటప్పుడు కాస్త తేలిగ్గా జీర్ణం అయ్యే పదార్థాలనే తీసుకోవడం బెటర్. వేడిగా ఏది తిన్నా త్వరగా జీర్ణం అవుతుంది. పైగా ఆరోగ్యం కూడా అంతే ఉంటుంది. హైడ్రేటింగ్ ఆహారాలలో కూరగాయలను ఎంచుకోవాల్సి వస్తే మాత్రం బరువు తగ్గేంచేది, తేలిగ్గా అరిగే వాటిలో ముందుగా చెప్పుకునేది ఆనపకాయ లేదా సొరకాయను చెప్పచ్చు. దీనిలోని నీటి శాతం కారణంగా ఇది త్వరగా జీర్ణం అవుతుంది. పైగా విటమిన్లు కూడా అధికంగానే ఉన్నాయి. ఇందులో ఇంకా ఎలాంటి గుణాలున్నాయంటే..
సొరకాయలో విటమిన్ బి, సి, ఎ, కె, ఈ, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. దీనిని కూరగానే కాకుండా జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. ఇది రోజంతా శక్తితో ఉండేలా చేస్తుంది.
Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!
సొరకాయ గుండెకు ఆరోగ్యం ఇస్తుంది.
ఇందులో పొటాషియం, అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెకు శరీరానికి రక్త ప్రవాన్ని సాఫీగా చేస్తుంది. డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకాన్ని తగ్గించడానికి, ఆమ్లత్వాన్ని, గ్యాస్ ఇబ్బందిని తగ్గించడానికి సహాయపడుతుంది.
శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.
సొరకాయలో నీరు అధికంగా ఉంటుంది. అధిక ఫైబర్, ఆల్కలీన్ కంటెంట్ కారణంగా తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఒత్తిడిని, అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్లకు చెక్..
యూరినరీ ఇన్ఫెక్షలకు సహజ నివారిణిగా చెప్పవచ్చు. నిమ్మరసం కలిపి ఈజ్యూస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!
పొట్ట సమస్యలకు..
ఇందులోని ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. టీస్పూన్ ఉప్పు కలిపిన ఉడికించిన ముక్కలను తీసుకుంటే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవచ్చు.
కాలేయంలో మంట..
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఈ సొరకాయ కాలేయ మంటను తగ్గిస్తుంది. ఇది కాలేయాన్ని ఫ్రీరాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతుంది. ఫలితంగా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.