Liver Health : లివర్ అనారోగ్యాన్ని గుర్తించే లక్షణాలు ఇవే.. !
ABN , Publish Date - Jun 01 , 2024 | 04:54 PM
కాలేయం చాలా రకాలుగా దెబ్బతినే అవకాశం ఉంది. హెపటైటిస్ పిత్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కొలస్టాసిస్.. లేదా ట్రైగ్లిజరైడ్స్ ఇది స్టీటోసిస్‌లో పేరుకుపోతుంది. దీనితో కాలేయకణజాలం రసాయనాలు, ఖనిజాలు దెబ్బ తింటాయి. కాలేయ సమస్యల్లో చర్మం సులభంగా దురద ఉంటుంది. కళ్ళు , చర్మం పసుపు రంగులో కనిపిస్తాయి. దీనినే కామెర్లు అంటారు.
శరీరంలో ఏ అవయవానికి అనారోగ్యం ఉన్నా అది బయటకు కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అయితే వాటిని నిశితంగా పరిశీలించి తెలుసుకుంటూ ఉండాలి. శరీర అవయవాల్లో ముఖ్యమైన గుండె, కాలేయం వంటి అవయవాల్లో దేనికి సమస్య ఉన్నా సరే అది కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయంటే కాలేయానికి ఇబ్బంది ఉన్నట్లయితే మొదటగా.. వికారం, అలసట వంటి సంకేతాలు ఉంటాయి. తరవాతి దశలో కామెర్లు, చర్మం మీద దురద ఉంటుంది. వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
వీటిలో ముఖ్యంగా..
శరీరం నీరు పట్టినట్టుగా, ఉబ్బి ఉంటుంది. ముఖ్యంగా పాదాలు ఉబ్బి కనిపిస్తాయి. అలాగే వికారం ఎక్కువగా ఉంటుంది. తల తిరగడం, కామెర్లు కూడా ఉంటాయి. దీనితో పాటు చర్మం మీద దురద ఎక్కువగా ఉంటుంది.
Expensive Foods : భారతదేశంలో లభించే 5 అత్యంత ఖరీదైన ఆహారాలు..
ఈ లక్షణాలు ఎందుకంటే..
కాలేయం ఆరోగ్యం దెబ్బ తినడానికి ఆల్కహాల్ అలవాటు ఉండటం, ఊబకాయం కూడా ముఖ్య కారణాలు. చెడు అలవాట్లు, సరిగా లేని జీవన శైలి విధానం ప్రధాన కారణం.
ఆహారం, ముఖ్యంగా కొవ్వుల జీర్ణక్రియలో అవసరమైన పిత్త ఉత్పత్తిని చేస్తుంది.గ్లూకోజ్ లేదా చక్కెర నిల్వ గ్లైకోజెన్ గా, శరీరానికి శక్తి కోసం అవసరమైనప్పుడు తిరిగి గ్లూకోజ్‌గా మారుస్తుంది.
కాలేయం మన శరీరంలో అతి పెద్ద ఘన అవయవం.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఇనుమును ప్రాసెసింగ్ చేస్తుంది.
Symptoms Of Typhoid: టైఫాయిడ్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..
రక్తం గడ్డకట్టే కారకాలను ఉత్పత్తి చేస్తుంది.
కొవ్వు రవాణాకు అవసరమైన కొలెస్ట్రాల్, రసాయనాల తయారీలో పనిచేస్తుంది.
సిర్రోసిస్ అనేది కాలేయం మీద మచ్చలుగా ఏర్పడుతుంది.
కాలేయం చాలా రకాలుగా దెబ్బతినే అవకాశం ఉంది. హెపటైటిస్ పిత్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కొలస్టాసిస్.. లేదా ట్రైగ్లిజరైడ్స్ ఇది స్టీటోసిస్‌లో పేరుకుపోతుంది. దీనితో కాలేయకణజాలం రసాయనాలు, ఖనిజాలు దెబ్బ తింటాయి. కాలేయ సమస్యల్లో చర్మం సులభంగా దురద ఉంటుంది. కళ్ళు , చర్మం పసుపు రంగులో కనిపిస్తాయి. దీనినే కామెర్లు అంటారు.
కాలేయ వ్యాధి దీర్ఘకాలికమైనది. అందుకే నెమ్మదిగా కామర్లు, నొప్పి, కడుపు నొప్పితో సహా తీవ్రమైన కాలేయ వైఫల్యం వారాలు లేదా రోజులు మాత్రమే పడుతుంది. ఈ పరిస్థితి వైఫల్యానికి కారణం కావచ్చు. వెంటనే ఈ లక్షణాలు కనపించగానే డాక్టర్ని సంప్రదించాలి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.