Curly Hair: గిరజాల జుట్టు పోషణకు ఈ చిట్కాలు పాటించి చూడండి..!
ABN , Publish Date - Mar 23 , 2024 | 02:25 PM
శరీరానికి కావాల్సిన పోషణ మాత్రమే ఆహారంలో తీసుకుంటే సరిపోదు.. శిరోజాల అందాన్ని పెంచే విధంగా కూడా ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు రాలడం చాలా మంది మహిళలను వేధిస్తుంటుంది.
కర్లీ హెయిర్‌కు కాస్త ఎక్కువే పోషణ అవసరం. ఈ వెట్రుకలు ఎక్కువగా పొడిబారడం, చిట్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే, హెయిర్ క్రీం ప్రయత్నించాలి. ఇవి షైన్ చెక్కుచెదరకుండా కర్ల్స్ పాడవకుండా ఎప్పుడూ నిగనిగలాడేట్టుగా ఉండేలా చేస్తాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో గిరజాల జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది. కర్ల్స్‌ను కాపాడుకోవడానికి ఈ చిట్కాలు పాటించాల్సిందే..
జుట్టు పొడవుగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అయితే ఇప్పటి కాలంలో చాలా వరకూ కాలుష్యం కారణంగా, సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే శరీరానికి కావాల్సిన పోషణ మాత్రమే ఆహారంలో తీసుకుంటే సరిపోదు.. శిరోజాల అందాన్ని పెంచే విధంగా కూడా ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు రాలడం చాలా మంది మహిళలను వేధిస్తుంటుంది. ఈ సమస్య తగ్గడానికి రకరకాల షాంపూలు వాడుతూ ఉంటారు. ఇలాంటివి హెయిర్ పెరిగే కంటే ఊడిపోతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించాలంటే మాత్రం..
1. సరైన బ్రష్‌ను ఎంచుకోవాలి.
2. జుట్టు విరిగినట్టుగా, బ్రష్ పెట్టగానే తలలో పెట్టగానే వెంట్రకలు ఊడిపోకుండా ఉండాలంటే వెడల్పాటి దంతాలున్న దువ్వెన్నను ఎంచుకోవాలి.
3. సులభమైన కండీషనర్‌ని వాడాలి.
ఇది కూడా చదవండి: వేసవిలో మట్టి కుండలో నీటిని ఎందుకు తాగాలి..! దీనితో కలిగే ప్రయోజనాలేంటి..!
4. జుట్టు తేమగా ఉంచుకోవాలి.
5. గిరజాల జట్టు త్వరగా పొడిగా, పెళుసుగా మారుతుంది. కాబట్టి కర్ల్స్‌ను పోషణ, హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం.
6. జుట్టును హైడ్రేట్ గా ఉంచడానికి లీవ్ - ఇన్ కండీషనర్ అప్లై చేయాలి.
7. కొబ్బరి నూనే, ఆలివ్ ఆయిల్ వంటి సహజ నూనెలను ఉపయోగించాలి.
8. జుట్టును శుభ్రం చేసే విషయంలో వేడి నీటిని ఉపయోగించడం మనుకోవాలి.
9. జుట్టును కడిగేటప్పుడు వేడి నీటిని ఉపయోగించకుండా ఉండాలి, ఎందుకంటే ఇది జుట్టు నుండి తేమను తొలగించి పొడిగా మారుస్తుంది.
ఇవి కూడా చదవండి: నలుపు ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే పది ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!
బాక్స్ శ్వాస అంటే ఏమిటి? దీని ప్రధాన ప్రయోజనాలు ఏంటి..!
వేసవిలో మట్టి కుండలో నీటిని ఎందుకు తాగాలి..! దీనితో కలిగే ప్రయోజనాలేంటి..!
బరువు తగ్గడాన్ని ప్రోత్సహించే వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది..!
10. జుట్టును పోనీటైల్ లేదా జడగా అల్లుకుంటూ ఉండాలి. లేదంటే జుట్టు చిట్లిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంది.
11. వేడి కర్ల్స్ ను పాడు చేస్తుంది. తేమను కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి డ్రైయర్‌కి బదులుగా టవల్‌తో మాత్రమే జుట్టును శుభ్రం చేసుకోవాలి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.