Ayurveda: హార్మోన్లను బ్యాలెన్స్ చేయాలంటే తీసుకోవాల్సిన 5 ఉత్తమ మూలికలు ఇవే..!
ABN , Publish Date - Jan 05 , 2024 | 12:59 PM
ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కలిగి ఉండకపోవడం, బరువు హెచ్చుతగ్గులు, అలసట, ఈ లక్షణాల మొత్తం ప్రభావితం చూపిస్తాయి. హార్మోన్ల అసమతుల్యతను తగ్గించాలంటే ఆయుర్వేదంలో తీసుకోవాల్సిన పదార్థాలు ఇవే..
మనిషి జీవనశైలి బావుండాలంటే తీసుకునే ఆహారం దగ్గరనుంచి అలవాట్లు వరకూ రోజువారి చేసే పనులు ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. అయితే హార్మోన్ల అసమతుల్యత కూడా శరీరంలో ఆరోగ్యం పైన కీలకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కలిగి ఉండకపోవడం, బరువు హెచ్చుతగ్గులు, అలసట, ఈ లక్షణాల మొత్తం ప్రభావితం చూపిస్తాయి. హార్మోన్ల అసమతుల్యతను తగ్గించాలంటే ఆయుర్వేదంలో తీసుకోవాల్సిన పదార్థాలు ఇవే..
అశ్వగంధ: ఆయుర్వేదంలో ఒత్తిడిని తగ్గించే శ్రేష్టమైన హార్మోన్లను పెంచే ఔషదం అశ్వగంధ, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. కార్టిసాల్ ను తగ్గిస్తుంది. ఇది పురుషులు, మహిళలు ఇద్దరూ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. శక్తిస్థాయిలను పెంచుతుంది. మానసిక స్థితిన మెరుగుపరుస్తుంది. చక్కని నిద్రను ఇస్తుంది.
చస్టెబెర్రీ: ఆడవారిలో పునరుత్పత్తి ఆరోగ్యానికి, బుుతు చక్రాలు క్రమంలో ఉంచేందుకు PMSలక్షణాలను తగ్గించడంలో, హాట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్, రుతుక్రమం ఆగిన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. పిట్యూటరీ గ్రంధిని ప్రభావితం చేస్తుంది. ప్రొజెస్టెరాన్, ప్రోలాక్టిన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
పుదీనా: పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ ఉన్న మహిళలు స్పియర్ మింట్ శక్తివంతమైనది. ఇది మెటిమలను, జుట్టు పెరుగుదలను pcos లక్షణాలను, టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మింట్ టీ తరచుగా తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ఇది కూడా చదవండి: మాయచేసి తప్పించుకోవడంలో ఈ తిమింగలం కన్నా తెలివైన జంతువు లేదంటే నమ్ముతారా..!!
మకా: ఈ పెరువియన్ రూట్ సహజ కామోద్దీపన లక్షణాలకు ప్రసిద్ధి చెందింది, అయితే ఇది హార్మోన్లను నియంత్రించడంలో కూడా పనిచేస్తుంది. మకా మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.
తులసి: ఆయుర్వేదంలోని శక్తివంతమైన ఔషదంగా చెప్పుకునే తులసి, యాంటీ-స్ట్రెస్ లక్షణాలను కలిగి ఉంది, దాని అడాప్టోజెనిక్, కార్టిసాల్-తగ్గించే సామర్థ్యాలను కలిగి ఉంది. ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)