Hair Growth: సహజమైన పద్దతుల్లో జుట్టు పెరగాలంటే ఈ ఏడు దారులూ ట్రై చేయండి..!
ABN , Publish Date - Jun 11 , 2024 | 03:43 PM
జుట్టు పెరగడానికి ప్రోటీన్ అవసరం. శరీరంలో A,C,D,E బయోటిన్ వంటి విటమిన్లు లోపించినా కూడా జుట్టు త్వరగా పెరగడం ఉండదు. అందుకే వీటి లోపాన్ని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
జుట్టు అందంగా పొడవుగా ఉంటే అదో అందం. ఇప్పటి రోజుల్లో పొడవాటి జుట్టు కాస్త తక్కువే. ఒత్తైన జుట్టు కూడా చాలా వరకూ తక్కువగానే ఉంటుంది. దీనికి కారణం వాతావరణంలో పెరిగిన కాలుష్యం కూడా ఒక కారణం, దీనికి తోడు జీవన శైలిలో మార్పులు కూడా ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
క్రమం తప్పకుండా మసాజ్
తలలో దువ్వెన్న పెట్టడం తప్ప మరే విధమైన పద్దతిలోనూ తలకు మసాజ్ అనేది చేయం మనం. ఇది కూడా ఒక రకంగా జుట్టును బలంగా మారుస్తుంది. మసాజ్ చేయడం వల్ల తల నరాలు యాక్టివ్ అవుతాయి. జుట్టు సంరక్షణలో భాగంగా క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల స్కాల్ఫ్ రిలాక్స్ గా ఉంటుంది. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది.
ట్రిమ్ చేయండి.
చీలికలుగా ఉన్న జుట్టును క్రమం తప్పకుండా ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఈ స్ప్లిట్ ఎండ్స్ జుట్టును పెరగకుండా చేస్తాయి. చివరలు చీలినట్టుగా ఉండి అందాన్ని పాడు చేస్తాయు. అందుకే సరైన సమయంలో ట్రిమ్ చేయడం అలవాటుగా పెట్టుకోవాలి.
ఆవిరితో..
వేడి వేడి నీటితో తల స్నానం చేసేస్తూ ఉంటారు. ఇది జుట్టు కుదుళ్ళను బలహీనం చేస్తుంది. అలా కాకుండా ఆవిరి పట్టించడం వల్ల జుట్టుకు మసాజ్ లా పనిచేస్తుంది. స్కాల్ఫ్లోని రంధ్రాలు తెరుచుకుంటాయి. నూనెను బాగా తీసుకుంటుంది. దీనితో జుట్టు బాగా పెరుగుతుంది.
Favorite Lipstick: లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..!
కండిషనింగ్..
కండిషనింగ్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. క్రమం తప్పకుండా కండిషనింగ్ చేస్తూ ఉండాలి.
హీటింగ్ టూల్స్..
బ్లో డ్రైయర్, స్ట్రెయిటెనింగ్ కర్లింగ్ ఐరన్ వంటి హీటింగ్ గాడ్జెట్స్ వల్ల జుట్టు నుంచి తేమను పీల్చుకుంటుంది. ఇది జుట్టు రాలడం, నిర్జీవంగా మారడానికి కారణం అవుతుంది.
డైట్ విటమిన్..
విటమిన్స్ కీలకంగా పనిచేస్తాయి. జుట్టు పెరగడానికి ప్రోటీన్ అవసరం. శరీరంలో A,C,D,E బయోటిన్ వంటి విటమిన్లు లోపించినా కూడా జుట్టు త్వరగా పెరగడం ఉండదు. అందుకే వీటి లోపాన్ని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
క్రమం తప్పకుండా షాంపూ..
క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో అధిక చెమట ఉంటుంది. దీనితో జుట్టును షాంపూ చేయాలి. నారానికి రెండుసార్లు జుట్టును కడగడం వల్ల ఒత్తుగా పెరుగుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.