Share News

Skin Chafing : తొడ చర్మం పగుళ్లను తగ్గించాలంటే ఈ ఆరు టిప్స్ ట్రై చేయండి.. సరిపోతుంది..!

ABN , Publish Date - May 29 , 2024 | 12:57 PM

మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా తొడల భాగంలో పూస్తూ ఉండాలి. ఇది తేమను మామూలుగా ఉంచి, చర్మాన్ని పొడిగా మారుస్తుంది. దురద కూడా తగ్గుతుంది.

Skin Chafing : తొడ చర్మం పగుళ్లను తగ్గించాలంటే ఈ ఆరు టిప్స్ ట్రై చేయండి.. సరిపోతుంది..!
Skin Chafing

స్కిన్ చాఫింగ్ సాగినట్టుగా, తొడ చర్మం కట్ అయ్యి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చర్మం ఎరుపు, వాపు, మరీ ఎక్కువగా ఉంటే చీము, కావడం వల్ల నడక కూడా ఇబ్బందిగా మారుతుంది. చికాకు, ఇబ్బంది, నొప్పి కలిగిస్తుంది. కాస్త లావుగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తొడలు రాసుకుపోవడం అనేది వేసవిలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో చెమట కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే...

చర్మం చిట్లినట్టుగా ఉండటం వల్ల నొప్పి, వాపు ఉంటుంది.

దుస్తులు టైట్‌గా ఉండటం.. ఇలా టైట్ దుస్తులు వేసుకోవడం వల్ల చర్మం రాపిడికి గురవుతుంది. దీనితో తొడ చర్మం రాసుకుపోతుంది. దీనితో నడవడం ఇబ్బందిగా మారుతుంది. దీని నుంచి బయటపడాలంటే వదులుగా ఉండే దుస్తుల్నే వేసుకోవాలి. వేసవిలో చెమట పట్టకుండా గాలి తగిలేలా ఉండాలి. అప్పుడే ఈ ఇబ్బంది తగ్గుతుంది.

యాంటీ చాపింగ్ ఉత్పత్తులు.. తొడల చర్మం రాసుకుపోయినట్టుగా ఉంటే పెట్రోలియం జెల్లీ, యాంటీ చాపింగ్ బామ్స్ వాడటం వల్ల చర్మం రాపిడి సమస్య తగ్గుతుంది.

హైడ్రేటెడ్ గా ఉండండి.. చర్మం పొడిబారినట్టుగా ఉండటం కారణంగా కూడా ఈ సమస్య ఉంటుంది. వేసవిలో ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది.


White Teeth : దంతాలను తెల్లగా మార్చేందుకు సహాయపడే మూలికలు ఇవే..!

పాదరక్షల విషయంలో.. మనం ధరించే దుస్తుల కారణంగానే కాదు, పాదరక్షల కారణంగా కూడా అంతే కారణం అవుతాయి. కాబట్టి మరీ హీల్స్, లేదంటే కాలిని పట్టి ఉంచే విధంగా కాకుండా కాస్త ఒదులుగా ఉండే పాదరక్షలు మంచిది.

చర్మం చిట్లడం నుంచి ఉపశమనం..

మాయిశ్చరైజర్.. మాయిశ్చరైజర్ ను క్రమం తప్పకుండా తొడల భాగంలో పూస్తూ ఉండాలి. ఇది తేమను మామూలుగా ఉంచి, చర్మాన్ని పొడిగా మారుస్తుంది. దురద కూడా తగ్గుతుంది.

Healthy Fruits: ఉదయాన్నే పరగడుపున ఈ పండ్లను తింటే చాలు.. ఇక మందులతో పనేలేదు..!


1. అలోవేరా జెల్ కూడా ఈ చర్మం చిట్లడాన్ని తగ్గిస్తుంది.

2. మరీ ఎక్కువగా చిట్లినట్టుగా ఒరుసుకుపోతే ఆ చర్మాన్ని కట్టుతో కవర్ చేయడం లేదా బ్యాండేజీ వేయడం వంటివి చేయాలి.

3. అక్కడి చర్మం పూర్తిగా నయం అయ్యేంత వరకూ చికాకు కలిగించే దుస్తులను వేసుకోకపోవడమే మంచిది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే కనుక డాక్టర్ సలహాను పాటించడం మంచిది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 29 , 2024 | 12:57 PM