Share News

Supplements: వింటర్ డైట్‌లో చేర్చుకునేందుకు 5 విటమిన్ డి డ్రై ఫ్రూట్స్.. !!

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:08 PM

మనం రోజువారి తీసుకునే ఆహారంలో విటమిన్ డి తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి. ఇది కండరాలను దృఢంగా మార్చడంలో కీలకంగా పనిచేస్తుంది. శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, వాపుల్ని ఇది నియంత్రిస్తుంది.

Supplements: వింటర్ డైట్‌లో చేర్చుకునేందుకు 5 విటమిన్ డి డ్రై ఫ్రూట్స్.. !!
Vitamin D levels

విటమిన్ డి సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. చాలా వరకూ మనం తినే ఆహారాలలో విటమిన్ డి కాస్త తక్కువగానే ఉంటుంది. దీనిని పొందాలంటే మనం రోజువారి తీసుకునే ఆహారంలో విటమిన్ డి తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి. ఇది కండరాలను దృఢంగా మార్చడంలో కీలకంగా పనిచేస్తుంది. శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, వాపుల్ని ఇది నియంత్రిస్తుంది. అయితే విటమిన్ డిని ఏ ఆహారం నుంచి పొందవచ్చు అనేది తెలుసుకుందాం. విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే..

అంజీర్..

రుచికరమైన అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో 5-10% DVని, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి.

ఎండిన ఆప్రకాట్లు..

ఈ సహజసిద్ధమైన పండ్లు విటమిన్ డి 5%DVని అందిస్తాయి. అవి ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉంటాయి.

బాదం..

విటమిన్ డి కోసం బాదంపప్పును తీసుకుంటే అందులో 2-3%DVని అందిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఆహారంలో ఉసిరిని చేర్చడం వల్ల బరువు తగ్గడమే కాదు, మధుమేహం కూడా తగ్గుతుందా..!!


ఎండుద్రాక్ష

ఎండిన ద్రాక్షలో విటమిన్ డి సుమారు 1-2% DV లభిస్తుంది. ఇందులో ఉన్న ఇనుము, ఫైబర్ శరీరంలో శక్తికి మూలం.

ఎండిన బెర్రీస్

ఇందులో 1% DV ఒక శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ ఇది జీర్ణ క్రియకు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో పొటాషియం, విటమిన్ కె ఎక్కువగా ఉన్నాయి.

డ్రై ఫ్రూట్స్ మొత్తం విటమిన్ డి అందించేందుకు తోడ్పడతాయి. కాకపోతే సూర్యరశ్మితో విటమిన్ డి అందకపోతే ఆహారంతో పొందాలంటే మాత్రం డ్రై ఫ్రూట్స్ కాకుండా కొవ్వు చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, కొన్ని తృణధాన్యాలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 17 , 2024 | 02:10 PM