Share News

Health Tips : తల్లిపాలతో బిడ్డకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి..!

ABN , Publish Date - Aug 06 , 2024 | 03:54 PM

తల్లిపాలు ఇచ్చే సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ గర్భధారణ సమయంలో డెలివరీ సమయంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు పాల కోసం రొమ్మును పీల్చినపుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రొమ్ము కణజాలం సంకోచించి, పాలు విడుదల అయ్యేలా చేస్తుంది.

Health Tips : తల్లిపాలతో బిడ్డకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి..!
Health Benefits

తల్లిపాలు శిశువుకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. బిడ్డ ఎదుగుదలకు పోషకాలను అందిస్తాయి. రొమ్ముపాలలో యాంటీబాడీస్, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి శిశువుకు సహకరిస్తాయి. ఇంకా తల్లిపాలతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో చూద్దాం.

బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల..

అప్పుడే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి, బిడ్డ తీసుకున్న ఆహారం తేలిగ్గా, సులభంగా జీర్ణం కావడానికి తల్లిపాలే సరైనవి. ఈ తల్లిపాల ద్వారానే బిడ్డకు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, మిటమిన్లు, మినరల్స్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అందుతాయి. పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది తల్లి పాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇది శిశువులో మెదడు పెరుగుదలకు సహకరిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ పాలు మెరుగ్గా పనిచేస్తాయి. తల్లిపాలలో యాంటీబాడీస్ అధికంగా ఉన్నాయి. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం, మధుమేహం, లుకేమియా, SID, ఊబకాయం, జీర్ణాశయ ఇన్ఫెక్షన్లను, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధిని తగ్గిస్తాయి.

తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు..

తల్లిపాలు ఇచ్చే సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ గర్భధారణ సమయంలో డెలివరీ సమయంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు పాల కోసం రొమ్మును పీల్చినపుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రొమ్ము కణజాలం సంకోచించి, పాలు విడుదలయ్యేలా చేస్తుంది.


Women Health : గర్భం దాల్చిన తర్వాత చర్మ సమస్యలు ఎందుకు వస్తాయ్.. !

1. తల్లిపాలు శిశువులకు ఆరోగ్యం.

2. బిడ్డకు తల్లిపాలు సంపూర్ణ పౌష్టికాహారం.

3. బిడ్డకు తల్లిపాలలో కావాల్సిన అన్ని పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ లభిస్తాయి.

4. తల్లి పాలు తాగితే పిల్లలు ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు. ఊబకాయం సమస్య ఉండదు.


Healthy Foods : నానబెట్టిన బాదం, వేరుశెనగలో ఏది ఆరోగ్యానికి మంచిది ?

5. తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, ఒబెసిటీ సమస్యలు రాకుండా ఉంటాయి.

6. ప్రతి తల్లీ, బిడ్డ పుట్టిన ఏడాదిన్నర పాటూ పాలు పట్టించడం ఎంతో మేలు.

7. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

8. సంపూర్ణ ఆరోగ్యంతో, చురుకుగా ఉంటారు.

9. తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది.

బిడ్డకు పాలు ఇచ్చే తల్లి కూడా బలమైన ఆహారం తీసుకోవాలి. ఎటువంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే, బిడ్డకు సరైన పాలు ఇవ్వగలుగుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 06 , 2024 | 03:54 PM