Drinking Vamu Water : వాము నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే...
ABN , Publish Date - Jul 22 , 2024 | 12:20 PM
ఈ చిన్న గింజలలో అద్భుత ప్రయోజనాలను అందించే శక్తి ఉంది. వాము గింజలను క్యారమ్ సీడ్స్, అజ్వైన్ అని పిలిచే వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
భారతీయ ఆహారంలో ప్రధానంగా ఉపయోగించే చాలా పదార్థాలలో వాము కూడా ఒకటి. వాము ఆహారంలోనే కాదు. మన వైద్యంలో కూడా ప్రధానంగా ఉపయోగిస్తారు. వాము జీర్ణ శక్తిని పెంచుతుంది. ఈ కారణంగా పిల్లలకు, పెద్దలకు వాము నీరు వాడుతూ ఉంటారు. ఎటువంటి జీర్ణ సమస్య అయినా వాము నీరు మంచి పరిష్కారంగా ఉపయోగిస్తారు. ఇంకా ఈ వాముతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే..
ఈ చిన్న గింజలలో అద్భుత ప్రయోజనాలను అందించే శక్తి ఉంది. వాము గింజలను క్యారమ్ సీడ్స్, అజ్వైన్ అని పిలిచే వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
యాంటీమైక్రోబయల్ లక్షణాలున్న వాములో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
Good Heabits : ఒత్తిడి లేని జీవనానికి 7 అలవాట్లు ఇవే.. !
వాము తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నీటిని తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, అపాన వాయువు నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్ట్రిక్ రాసాలను ప్రేరేపించి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహకరిస్తుంది.
పెద్దలు, పిల్లల్లో కనిపించే గ్యాస్ట్రిక్ ఇబ్బందిని ప్రేగుల అసౌకర్యాన్ని తగ్గించడానికి సహకరిస్తుంది.
Milk Time : పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !
జీర్ణక్రియను మెరుగపరచడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడంలో వాము సహకరిస్తుంది. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా వాము తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. శ్వాసకోశ ఇబ్బందులు కూడా దీనితో పరార్. వాములో థైమోల్ వంటి సమ్మేళనాలున్నాయి. ఇవి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు, దగ్గు, జలుబు, ఆస్తమా లక్షణాలను తగ్గించేందుకు సహకరిస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.