Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
ABN , Publish Date - Jul 18 , 2024 | 01:47 PM
పడకగది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సరైన నిద్రపడుతుంది.
నిద్ర శరీరాన్ని ఉత్తేజంగా ఉంచేందుకు నిద్ర చాలా అవసరం. ఒక్క రాత్రి నిద్రలేకపోయినా మరుసటి రోజుకి బాగా అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఏ పని చేయాలన్నా సత్తువ లేనట్టుగా ఉంటుంది. శరీరం వాలిపోతున్నట్టుగా, నిస్సత్తువగా ఉండటం అనేది కామన్ గా కనిపించే లక్షణాలు. అయితే రాత్రి పూట నిద్ర సరిగా ఉండకపోవడం అనేది కొద్దిమందిలో మాత్రమే కనిపించే లక్షణం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. సరైన జీవన శైలి అలవాట్లు లేకపోవడం ప్రధాన కారణం, ఇంకా అనారోగ్య కారణాలతో కూడా రాత్రి సమయంలో నిద్ర అనేది ఉండకపోవచ్చు.. అసలు దీనికి గల కారణాలు ఏమిటనేది చూద్దాం.
నిద్రపోవడానికి కష్టపడటం నిరాశ కలిగిస్తుంది. సరైన నిద్రలేకపోవడం అనేది ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి పూట నిద్ర సమంగా ఉండాలంటే..
స్థిరమైన నిద్ర షెడ్యూల్ వేయండి..
వారాంతంలో కూడా సరైన సమయానికి పడుకుని, సరైన సమయానికి నిద్ర లేచే అలవాటును చేసుకోవాలి. దీనితో సమయం కాగానే నిద్రపోవడం, మేల్కోవడం అనేది సులభం చేస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటున్నామా.. సరైన సమాయనికే నిద్రపోతున్నామా అనేది గమించుకోవాలి. ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల సమయం నిద్రపోవాలి.
Cardamom Tea : నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!
రిలాక్సింగ్ బెట్ టైమ్..
నిద్రపోయే ముందు ప్రశాంతమైన పనులు మాత్రమే చేయాలి. శరీరానికి విశ్రాంతిని ఇచ్చేలా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, పుస్తకం చదవడం, ధ్యానం చేయడం, యోగా వంటివి చేస్తూ ఉండాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం, వంటివి చేయకూడదు.
బ్లూలైట్ వద్దు..
ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల కారణంగా వచ్చే బ్లూ లైట్ శరీరం మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇది నిద్రను నియంత్రంచే హార్మోన్. నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు స్క్రీన్ చూడకపోవడం మంచిది. తప్పని పరిస్థితిలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లతే బ్లూలైట్ ఫిల్టర్ ని ఉపయోగించడం, బ్లూలైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ధరించడం చేయాలి.
Heart Problem : గుండె పోటు రాబోతుందని శరీరం ముందే చెబుతుందా..!
సరైన డైట్...
తినేవి, త్రాగేవి నిద్రను ప్రభావితం చేస్తాయి. నిద్రవేళకు ముందు పెద్దగా భోజనం చేయడం వల్ల కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి తీసుకుంటే నిద్రను సరిగా రానీయవు. ఆకలిగా ఉంటే తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అరటిపండ్లు, బాదంపప్పులు, ఓట్ మీల్ వంటివి నిద్రకు అనుకూలంగా ఉంటాయి. చమోమిలే, పిప్పరమెంట్ , హెర్బల్ టీలు కూడా పనిచేస్తాయి.
సౌకర్యవంతమైన నిద్ర..
పడకగది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సరైన నిద్రపడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.