Brain Tumor: మెదడులో కణితులు ఉన్నట్లయితే ఈ లక్షణాలు, సంకేతాలు ఎలా ఉంటాయి..!!
ABN , Publish Date - Jun 08 , 2024 | 04:38 PM
శరీరంలో కణితులు మెదడు లేదా వెన్నుపాములో ప్రారంభం అవుతాయి. ఈ కణితులు మెదడులో అసాధారణ కణాలు వృద్ధి చెందడం, గుణించడం కారణంగా పేరుకుపోయినప్పుడు మెదడులో కణితి ఏర్పడుతుంది. పిట్యూటరీ గ్రంధిలో పిట్యూటరీ కణితులు ఏర్పేందుకు అవకాశం ఉంటుంది.
శరీరంలో కణితులు మెదడు లేదా వెన్నుపాములో ప్రారంభం అవుతాయి. ఈ కణితులు మెదడులో అసాధారణ కణాలు వృద్ధి చెందడం, గుణించడం కారణంగా పేరుకుపోయినప్పుడు మెదడులో కణితి ఏర్పడుతుంది. పిట్యూటరీ గ్రంధిలో పిట్యూటరీ కణితులు ఏర్పేందుకు అవకాశం ఉంటుంది. ఈ మెదడు కణితి అనేది మెదడులోని సమీపంలో కణాల పెరుగుదల. మెదడు కణితులు మెదడు కణజాలంలో సంభవించే అవకాశం ఉంటుంది.
ఇది మెదడు కణితులు మెదడులో ప్రారంభం అవుతాయి. వీటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాల నుండి మెదడుకు వ్యాపిస్తుంది. ఈ కణితులు సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లు, వీటిని మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అని కూడా అంటారు.
తలనొప్పులు
అస్తమానూ తలనొప్పి వస్తూ ఉండటం ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఈ తలనొప్పులు తరచుగా ఉంటాయి. అలాగే తీవ్రంగా కూడా ఉంటాయి. దీనితో పాటు వికారం, వాంతులు కూడా ఉండవచ్చు.
మూర్చ..
ఈ సమయంలో మూర్చలు వస్తూ ఉంటాయి.
Liver Health : కాలేయంలో వాపు వస్తే కనుక సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
తెలివి తేటలు..
జ్ఞాపకశక్తి ఏకాగ్రత, వ్యక్తిత్వం లేదా ప్రవర్తనలో మార్పులు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా గందరగోళం, దిక్కుతోచని స్థితి కూడా పెరుగుతుంది. చికాకు కలిగిస్తుంది.
బ్యాలెన్స్ తప్పుతుంది.
సంతులనం, సమన్వయం నడక ఇబ్బంది వంటివి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.
బలహీనత ఉంటుంది.
శరీరం బలహీనంగా ఉంటుంది. చేతులు, కాళ్లు, ముఖం కూడా బలహీనంగా మారుతుంది.
Asheagandha Health : ఆరోగ్యాన్ని మార్చేసే ఆయుర్వేద మూలికల గురించి తెలుసా .. !
దృష్టి సమస్యలు..
కణితి మెదడులోని ఆప్టిక్ నరాలు, కంటి మార్గాలను ప్రభావితం చేస్తుంది. దీనితో దృష్టిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
స్పీచ్ ఇబ్బంది..
మాట్లాడటం కష్టంగా ఉంటుంది. వినడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది.
వినికిడి సమస్యలు..
వినికిడి లోపం, చెవులలో నొప్పి ఉంటుంది. నరాలు దగ్గర ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.